Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో లక్నో వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పిన శ్రేయస్ అయ్యర్.. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నలుగురికి తుది జట్టులో అవకాశం దక్కలేదన్నాడు.

ఆ తప్పులే కొంపముంచాయి: శుభ్‌మన్ గిల్

ఆ తప్పులే కొంపముంచాయి: శుభ్‌మన్ గిల్
Shreyas Iyer Reveals Why Nitish Reddy and Vaibhav Sooryavanshi Are Not Playing 1st T20I vs West Indies

పిచ్ కండిషన్స్‌తోనే..

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మిశ్రమ పిచ్. మంచు కూడా పడుతుంది. జపాన్ నుంచి మా ప్రయాణం చాలా కష్టంగా సాగింది. నిన్న రాత్రే ఇక్కడికి వచ్చాం. ఈరోజు మ్యాచ్ ఆడుతున్నాం. కానీ మేం పూర్తి ఏకాగ్రతతో ఉన్నాం. వెస్టిండీస్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు.

గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌ను శాసించారు. వారి వద్ద అద్భుతమైన బ్యాటింగ్, ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. రవి బిష్ణోయ్, నితీష్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నలుగురికి అవకాశం దక్కలేదు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)

Also Read

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)

గెలవడమే మా ఏకైక లక్ష్యం..

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు. 'మేం టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. భారత్ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టార్గెట్‌ని ఛేజ్ చేయడం ఈజీ. మేమైతే డిఫెండ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాం.

పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం గురించే మేం ప్రధానంగా మాట్లాడుకున్నాం. మనం వెళ్లే ప్రతీ చోటా వాతావరణం, పిచ్ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, ఈ కండిషన్స్‌కు త్వరగా అలవాటు పడాలని మా ఆటగాళ్లకు చెప్పాను.

మా జట్టులో కొంతమంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు. మరికొందరికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. కుర్రాళ్లకు సీనియర్లు మార్గదర్శకంగా ఉంటారు. మా అత్యుత్తమ ప్రదర్శనతో ఆశించిన ఫలితాన్ని అందుకోవడమే మా ఏకైక లక్ష్యం. ఆల్‌రౌండర్లతో ఆరు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.'అని షై హోప్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

వెస్టిండీస్ : షై హోప్ (కీపర్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, షమర్ స్ప్రింగర్, షమర్ జోసెఫ్.

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.

Story first published: Tuesday, October 6, 2026, 18:55 [IST]
Other articles published on Oct 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+