ఆ తప్పులే కొంపముంచాయి: శుభ్‌మన్ గిల్
టీమిండియా మూడో వన్డేలో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఓటమికి స్టేడియంలో ఆటగాళ్లు చేసిన పొరపాట్లే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకోవడంపై శుభ్‌మన్ గిల్ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయని స్పష్టం చేశారు. మ్యాచ్ తమ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపించినా విండీస్ బ్యాటర్లు ఆఖరి ఓవర్లలో దెబ్బకొట్టి విజయాన్ని లాక్కున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు, స్లో ఓవర్ రేట్ వల్ల 4 ఓవర్లు వెనకబడిపోవడం తమకు తీవ్ర నష్టం చేసిందని గిల్ వెల్లడించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ(92), రుతురాజ్ గైక్వాడ్(57) మధ్య రెండో వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొనగా.. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో(129 నాటౌట్) మెరిశాడు. అయితే వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయంగా 162 పరుగులు చేసి వన్డే చరిత్రలోనే తమ జట్టుకు అత్యంత భారీ రన్ ఛేజ్‌ను అందించాడు. ఈ విజయంతో 2023 తర్వాత వన్డే ఫార్మాట్లో భారత్ పై విండీస్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
డెత్ ఓవర్ల బౌలింగ్‌పై కూడా శుభ్‌మన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో దాడి చేయాలా లేదా పరుగులను నియంత్రించాలా అనే విషయంలో బౌలర్లకు స్పష్టత కొరవడిందని చెప్పారు. ప్రత్యర్థి జట్టు 5 లేదా 6 వికెట్లు కోల్పోయినప్పుడు ఏ విధమైన ఫీల్డింగ్ ఉంచాలనే దానిపై స్పష్టమైన ఆలోచన లేకపోవడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని.. ఆ విభాగంలో వెంటనే మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గిల్ పేర్కొన్నారు.
అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లను ఆఖరి వరకు దాచి ఉంచడానికి గల కారణాన్ని శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. పేసర్ గుర్నూర్ బ్రార్ కండరాలు పట్టేయడం వల్ల మళ్లీ బౌలింగ్ చేయడానికి వస్తాడో లేదో తెలియని అనిశ్చితి నెలకొందని, అందుకే వికెట్లు తీసే బౌలర్ అయిన కుల్దీప్ ఓవర్లను ఆఖరి క్షణాల కోసం ఉంచాల్సి వచ్చిందని చెప్పారు. ఇక జేడెన్ సీల్స్ బౌలింగ్ లో త్వరగా ఔట్ కావడంపై స్పందిస్తూ.. త్వరగా వికెట్ కోల్పోవడం ఎప్పుడూ నిరాశ కలిగిస్తుందని, అయితే ఆ బంతికి తాను అంతకంటే ఏమీ చేయలేకపోయానని గిల్ పేర్కొన్నారు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


