ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)
భారత్-ఏ వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్ట్రేలియా-ఏతో పుదుచ్చేరి వేదికగా జరుగుతున్న అనధికారిక తొలి వన్డేలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్ మిచెల్ ఓవెన్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. సహచర ఆటగాడిని బలంగా ఢీకొట్టాడు.
ఒకే క్యాచ్ కోసం ఇద్దరూ ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ క్యాచ్‌ను ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పూర్తి చేయగా ఎవరికి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా-ఏ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే యశ్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్‌లో షార్ట్ బాల్‌ను మిచెల్ ఓవెన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. ఈ క్యాచ్ కోసం ఓవైపు ప్రభ్ సిమ్రాన్ సింగ్.. మరోవైపు నిశాంత్ సింధు పరుగెత్తుకుంటూ వచ్చారు.

చివరకు ఇద్దరూ ఢీకొనగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ క్యాచ్ పూర్తి చేశాడు. గ్లోవ్స్ ఉండటంతో బంతి జారలేదు. వాస్తవానికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కాల్ ఇచ్చినా.. సింధు పట్టించుకోలేదు. ఏది ఏమైనా ఇద్దరి ఆటగాళ్లకు గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆస్ట్రేలియా 274 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. నాథన్ మెక్‌స్వీనీ(135 బంతుల్లో 13 ఫోర్లతో 123) భారీ శతకంతో చెలరేగగా.. విల్ సదర్లాండ్(68 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించింది.
భారత బౌలర్లలో సూర్యాన్ష్ షెడ్గే(4/40) నాలుగు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


