వైభవ్ సూర్యవంశీ గొప్పతనమే అది: శ్రేయస్ అయ్యర్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానం బయట చాలా ప్రశాంతంగా ఉండే వైభవ్.. గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం విధ్వంసకర బ్యాటర్‌గా మారుతాడని చెప్పాడు. ఇదే అతనిలోని గొప్ప విషయమని పేర్కొన్నాడు.
ఆసియా గేమ్స్ 2026లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బంగారు పతకం సాధించిన భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ సభ్యుడిగా ఉన్నాడు. శ్రీలంకతో సెమీఫైనల్లో దూకుడుగా ఆడాడు. ఫైనల్లోనూ పర్వాలేదనిపించాడు.
తాజాగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వైభవ్ సూర్యవంశీతో నేను క్రికెట్ గురించి కాకుండా బయటి విషయాలే ఎక్కువగా మాట్లాడుతుంటాను. అందరూ అతనితో క్రికెట్ గురించే మాట్లాడతారు కాబట్టే నేను ఇతర విషయాలు చర్చిస్తాను. అతనిలో ఎంత ప్రతిభ ఉందో మనందరికీ తెలుసు. అందుకే అతని కుటుంబం, జీవనశైలి, క్రికెట్ కాకుండా అతన్ని ఏ విషయాలు ఉత్సాహపరుస్తాయో తెలుసుకునేందుకు తరుచూ మాట్లాడుతుంటాను.

వైభవ్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ మైదానంలో మాత్రం విధ్వంసకరంగా ఆడుతాడు. ఇదే అతనిలో ఉన్న గొప్పతనం. వైభవ్ సూర్యవంశీతో మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను ఉండటం కూడా బాగుంటుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటంతోనే వైభవ్‌కు అవకాశాలు దక్కడం లేదు. కానీ వైభవ్ సూర్యవంశీ 15 మంది సభ్యుల జట్టులోనే ఉన్నాడు. అతనికి అవకాశం వచ్చే సమయం తప్పకుండా వస్తుంది. ఆ రోజు భారత క్రికెట్‌లో వైభవ్ ఆధిపత్యం చూపిస్తాడు.' అని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. తొలి మూడు టీ20ల్లో 14, 13, 15 పరుగులు చేసి నిరాశపర్చాడు. కానీ జింబాబ్వేతో సిరీస్‌లో మాత్రం దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం వైభవ్ ఎదురు చూస్తున్నాడు. మంగళవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


