Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఆ వికెట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.. మాది ఛాంపియన్ ఆట: శ్రేయస్ అయ్యర్

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సైమ్ ఆయూబ్ వికెట్‌తోనే మ్యాచ్ తమవైపు మలుపు తిరిగిందని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. వర్షం కారణంగా పెద్దగా ప్రాక్టీస్ చేయకపోయినా.. ఛాంపియన్ టీమ్ తరహాలో సత్తా చాటామని సంతోషం వ్యక్తం చేశాడు. ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ టీమ్ స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

శనివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.

IND vs PAK: పాక్ మార్క్ ఫీల్డింగ్.. ఢీకొని క్యాచ్ వదిలేసిన భారత ఆటగాళ్లు!

IND vs PAK: పాక్ మార్క్ ఫీల్డింగ్.. ఢీకొని క్యాచ్ వదిలేసిన భారత ఆటగాళ్లు!

మాది ఛాంపియన్ టీమ్..

'ఈ విజయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మేం జపాన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి విపరీతంగా వర్షం పడుతూనే ఉంది. దాంతో వారం రోజుల పాటు కనీసం మేం ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాం. అయినా సరే.. మా కుర్రాళ్లు ఏలాంటి సాకులు చెప్పకుండా తమను తాము సిద్దం చేసుకొని ట్రైనింగ్ కొనసాగించారు. ఒక ఛాంపియన్‌ టీమ్ ఉండాల్సిన అసలైన లక్షణం ఇది. ఈ రోజు సాధించిన ఈ గెలుపు మా కష్టానికి తగ్గ ఫలితమే.

IND vs PAK Shreyas Iyer Says Saim Ayub s Wicket Was the Match-Turning Point in Asian Games Final

ఒక వికెట్ పడితే చాలనుకున్నాం..

పాకిస్థాన్ బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడారు. మంచి మూమెంటమ్‌లో కనిపంచారు. దాంతో నేను ఐదో బౌలర్ ఓవర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా. ఆ తర్వాత బుమ్రా, సుందర్ వంటి ప్రధాన బౌలర్లతో బౌలింగ్ చేయించాలని ప్లాన్ చేశా. వారిని సరిగ్గా వాడుకున్నా.

ఛేజింగ్ రన్ రేట్ ఓవర్‌కు 13 నుంచి 14 దాకా వెళ్లినప్పుడు బ్యాటర్లు ఎలాగైనా పెద్ద షాట్లకు వెళ్తారని, ఒక వికెట్ పడితే మ్యాచ్ మొత్తం మా వైపు తిరుగుతుందని తెలుసు. సరిగ్గా మేం అనుకున్నట్లే జరిగింది. ఆ కీలక సమయంలో పడిన పాక్ బ్యాటర్ వికెట్... మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ బ్యాటర్ పేరు గుర్తు రావట్లేదు (సైమ్ ఆయూబ్).

Indi vs Pakistan మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

Also Read

Indi vs Pakistan మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సమష్టి కృషితోనే విజయం..

ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. ఈ రోజు మేం చేసింది అదే. అభిషేక్ మంచి ఆరంభం ఇస్తే.. తిలక్ అద్భుతంగా ముగించాడు. బౌలింగ్‌లో వాషింగ్టన్, అక్షర్ పటేల్ రాణించారు. బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది సమష్టి కృషి. మొత్తానికి ఒక పరిపూర్ణమైన విజయం.

ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సెలెబ్రేషన్స్ ఇంకా ప్లాన్ చేయలేదు. ఏం చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. హోటల్‌కు వెళ్లాక చూస్తాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

సైమ్ అయూబ్ వికెట్‌తో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులే చేసి ఓటమిపాలైంది.

హసన్ నవాజ్(51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అతనితో పాటు సైమ్ అయూబ్(29) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(2/29), వాషింగ్టన్ సుందర్(2/29), శివమ్ దూబే(2/33) రెండేసి వికెట్లు తీసారు. సైమ్ అయూబ్‌ ఔట్ అవ్వడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కింది.

Story first published: Saturday, October 3, 2026, 20:53 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+