Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై శ్రేయస్ అయ్యర్ బిగ్ స్టేట్‌మెంట్!

ఆసియా క్రీడల్లో గోల్డ్ సాధించిన అనంతరం టీమిండియా టీ20 జట్టు ఇప్పుడు వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు బ్యాటింగ్ శైలి, యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేడియంలో జట్టు లక్ష్యాలు, ఆటగాళ్ల మనస్తత్వం గురించి ఆయన మాట్లాడారు.

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తూ శ్రేయస్ అయ్యర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. వైభవ్ సూర్యవంశీ స్టేడియం బయట చాలా ప్రశాంతంగా, సిగ్గుపడే స్వభావంతో ఉంటాడని.. కానీ క్రీజులోకి అడుగుపెట్టగానే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే తుఫానులా మారిపోతాడని చెప్పారు. " మేము స్టేడియం బయట వైభవ్ సూర్యవంశీతో క్రికెట్ కంటే అతడి లైఫ్ స్టైల్, కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడతాం. తద్వారా అతడు జట్టులో సులభంగా కలిసిపోతాడు. వైభవ్ బయట ఎంతో ముద్దుగా, శాంతంగా ఉంటాడు.. కానీ గ్రౌండ్‌లో మాత్రం ఎంతో దూకుడుగా మారి విధ్వంసం సృష్టిస్తాడు" అని శ్రేయస్ అయ్యర్ తెలిపారు.

India T20 captain Shreyas Iyer Makes Huge Prediction Says Vaibhav Sooryavanshi Will Rule Indian Cricket

ప్రస్తుతం భారత జట్టులో అనుభవజ్ఞులైన, ప్రపంచకప్ విజేత ఓపెనర్లు ఆడుతున్నారని శ్రేయస్ అయ్యర్ గుర్తు చేశారు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్‌ను శాసిస్తాడని, సుదీర్ఘకాలం పాటు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తాడని ఆయన జోస్యం చెప్పారు. ఆటగాళ్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని తాను కోరుకుంటున్నానని.. తమలోని భయాన్ని వీడి ఆడినప్పుడే అసలైన సామర్థ్యం బయటకు వస్తుందని పేర్కొన్నారు. జట్టులో ప్రతీ ఒక్కరు ఒకరికొకరు తోడుగా నిలుస్తారని స్పష్టం చేశారు.

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

Also Read

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

తన నాయకత్వ శైలి గురించి మాట్లాడుతూ.. స్టేడియంలోకి అడుగుపెట్టగానే సిరీస్ గెలవడమే మొదటి ప్రాధాన్యత అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చారు. తొలి మ్యాచ్‌ల నుంచే ప్లేయింగ్ 11లో నిరంతరం ప్రయోగాలు చేయడం వల్ల ఆటగాళ్లలో అభద్రతా భావం పెరుగుతుందని.. తాను అలాంటి వాతావరణాన్ని కోరుకోవడం లేదన్నారు. తన సొంత బ్యాటింగ్ గురించి చెబుతూ.. ఎల్లప్పుడూ పరిస్థితులకు తగినట్లు ఆడేందుకు ఇష్టపడతానని, ప్రారంభంలో వికెట్లు పడితే ఇన్నింగ్స్ ను నిలబెట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచడం తనకు తెలుసని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు.

Story first published: Sunday, October 4, 2026, 15:24 [IST]
Other articles published on Oct 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+