Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీలను పక్కన పెట్టాం: శ్రేయస్ అయ్యర్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. గాయాల కారణంగా జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన అయ్యర్.. వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగుతున్నారని తెలిపాడు. వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా గాయాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని చెప్పాడు.

ఆ విషయంలో విఫలమయ్యాం..

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఇది మాకు తప్పక గెలవాల్సిన మ్యాచ్. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేం ఫియర్‌లెస్ గేమ్ ఆడాం. కానీ మా ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయలేకపోయాం. కానీ ఇది కొత్త రోజు. కొత్త ఆరంభం. మా కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. గత మ్యాచ్ గతం. ఈ రోజు కొత్తగా ఆరంభించాలి. సానుకూలంగా ఉంటూ.. పరిస్థితులను గమనించాలి. ఆట ఎలా సాగుతుందో అనేదానిపై ఓ అవగాహన‌కు రావాలి.

వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్‌కు, గాలి ఎటు వీస్తుందో.. దానికి అనుగుణంగా మారాలి. వ్యూహాత్మకంగా ఈ విషయాలన్నింటిలో స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఈ విషయాలన్నీ అనుకున్నట్లు జరిగితే ఆశించిన ఫలితాలు వస్తాయి. పిచ్ చూడటానికి బాగుంది. వికెట్ మీద గడ్డి బాగా ఉంది. కాబట్టి తొలి బంతి నుంచే పిచ్ ఎలా స్పందిస్తుందో కచ్చితంగా గమనిస్తాం.

మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. గాయాలతో ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. వరుణ్, హర్షిత్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Shreyas Iyer Reveals The Reason Why Harshit Rana and Varun Chakravarthy Missed 4th T20I vs England

గత మ్యాచ్ తరహాలోనే చెలరేగుతాం..

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన హ్యారీ బ్రూక్.. లియామ్ డాసన్ స్థానంలో రెహాన్ అహ్మద్ ఆడుతున్నట్లు చెప్పాడు.

'టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. పిచ్ చూడటానికి బాగుంది. శ్రేయస్ అయ్యర్ చెప్పినట్లు గడ్డి ఉంది. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. గత మ్యాచ్‌లో మేం అద్బుత ప్రదర్శన కనబర్చాం. కండిషన్స్‌కు తగ్గట్లుగా సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నాం.

ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. గత మ్యాచ్‌ తరహాలోనే ఈ మ్యాచ్‌లో రాణిస్తామని అనుకుంటున్నా. వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకొని సమష్టిగా రాణించే ప్రయత్నం చేస్తాం. జట్టులోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రతీ ఒక్కరు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరణ్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.

Story first published: Thursday, July 9, 2026, 22:07 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+