IND vs ENG 4th T20I: టీమిండియా జిడ్డు బ్యాటర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. నేడు(జులై 9) బ్రిస్టల్ వేదికగా జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ సిరీస్‌లో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. మరోవైపు పేలవ ఫామ్‌తో బాధపడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు కూడా ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మ.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
తిలక్ జిడ్డు బ్యాటింగ్‌తో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయానంతరం టీమిండియా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉంది. ఈ సిరీస్‌లో భారత జట్టు పతనానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణం.

ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అతను ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 114.29 మాత్రమే. 2025 నుంచి టీ20 మ్యాచ్‌ల్లో స్పిన్ బౌలింగ్‌పై అతని స్ట్రైక్‌రేట్ 109.5కు దారుణంగా పడిపోయింది.
సంజూను తీసుకోవాలంటూ..
ఐదో స్థానంలో తిలక్ వర్మ విఫలమవుతూ ఉండటంతో బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఐర్లాండ్‌తో సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సంజూ విఫలమవడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించారు. ఐదు మ్యాచ్‌ల్లో విఫలమైనా తిలక్ వర్మను జట్టు నుంచి తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో తిలక్ వర్మ విఫలమైతే.. తర్వాతి మ్యాచ్‌లో సంజూ శాంసన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ స్థానంలో బరిలోకి దిగిన ప్రిన్స్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగనున్నాడు. వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
భారత తుది జట్టు(అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

