Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అండగా నిలిచాడు. తానే టీమిండియా కోచ్‌‌ అయితే వైభవ్ సూర్యవంశీ వరుసగా 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతన్ని జట్టులో కొనసాగిస్తానని చెప్పాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి 2-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల 91 రోజుల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.

IND vs ENG 4th T20I: టీమిండియా జిడ్డు బ్యాటర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!

IND vs ENG 4th T20I: టీమిండియా జిడ్డు బ్యాటర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!

తప్పక గెలవాల్సిన మ్యాచ్..

భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 10 బంతుల్లో 14 పరుగులు చేసిన అతను.. తర్వాతి మ్యాచ్‌లో 5 బంతుల్లో 13 పరుగులే చేసి వెనుదిరిగాడు.

దాంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించి సంజూ శాంసన్‌ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వరుస పరాజయాల మధ్య టీమిండియా నాలుగో టీ20కి సిద్దమైంది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం.

Mohammad Kaif Says I d Back Vaibhav Sooryavanshi Even He Failed in 10 matches ahead of ENG vs IND 4th T20I

10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తా..

ఈ మ్యాచ్‌ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. 'వైభవ్ సూర్యవంశీ తన సామర్థ్యాన్ని చూపించిన తీరును బట్టి నేనే టీమిండియా కెప్టెన్ లేదా కోచ్‌గా ఉండి ఉంటే.. అతను వరుసగా 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా అవకాశం ఇస్తాను. వాస్తవానికి భారత క్రికెట్‌లో అంత ఓపిక ఉండదు. ఎవరూ అంతకాలం వేచి ఉండరు. కానీ నేను మాత్రం అతనికి ఆ అవకాశం ఇస్తాను.

ఎందుకంటే ఆ తరహా సామర్థ్యాన్ని అతను చూపెట్టాడు. అతనికి ఆశించిన ఆరంభం అయితే దక్కలేదు. ఏ కుర్రాడికైనా భారత్ తరఫున అరంగేట్రం అనేది అంత సులువు కాదు. ఐర్లాండ్‌లో అతనికి అవకాశం రాలేదు. ఇంగ్లండ్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడి కండిషన్స్‌లో జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు.

అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్ గెలిచేనా..?

అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్ గెలిచేనా..?

కాస్త సమయం కావాలి..

అతనికిప్పుడు 15 ఏళ్లు మాత్రమే. అపారమైన ప్రతిభ, అద్భుతమైన సామర్థ్యం కలిగిన బ్యాటర్. ఇంగ్లండ్ వంటి కఠినమైన కండిషన్స్‌లో అరంగేట్రం చేయడం ఎవరికీ అంత సులువు కాదు. మనమంతా అతను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్దంగా ఉన్నాడని అంటాం. నేను కూడా నమ్ముతున్నా. కానీ అతనికి కాస్త సమయం కావాలి.

పరిస్థితులను అడ్జస్ట్ చేసుకోవడానికి, ఈ స్థాయి క్రికెట్‌కు అనుగుణంగా మారడానికి, విభిన్నమైన మ్యాచ్ పరిస్థితులను ఎలా అంచనా వేయాలో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కానీ అతని ప్రతిభ అసాధారణమైనది. ఇప్పటికిప్పుడే జట్టు అతనిపై ఒక నిర్ణయానికి రావద్దు. అతన్ని ఆడిస్తూనే ఉండాలి. అతను ఒక్క ఇన్నింగ్స్‌లో చెలరేగితే చాలు. పరుగులు అవే వస్తాయి. 20 బంతుల్లో 60, 25 బంతుల్లో 70, 80 పరుగులు చేసే ఆటగాడు అతను.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, July 9, 2026, 18:34 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+