Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20 Rankings: టాప్‌ లేపిన శ్రేయస్ అయ్యర్.. టాప్-4లో ముగ్గురు భారత ఆటగాళ్లే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. టాప్-4 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లే కొనసాగుతున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 798 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో 42 బంతుల్లో సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్.. రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో 18 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్ టీ20 ర్యాంక్ మెరుగైంది.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

టాప్-3లో భారత బ్యాటర్లు..

భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ 904 రేటింగ్ పాయింట్స్‌తో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అభిషేక్ శర్మ 891 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ 883 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Shreyas Iyer Reaches New Career Milestone with No 4 Spot in ICC T20I Rankings

భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక స్థానం ఎగబాకి 9వ స్థానాన్ని అందుకున్నాడు. సంజూ శాంసన్ శాంసన్ నాలుగు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలో నిలవగా.. శివమ్ దూబే నాలుగు స్థానాలు దిగజారి 44వ ర్యాంక్‌కు పడిపోయాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 46వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ లేపిన మాట్ రేన్ షా..

వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ 2 స్థానాలు ఎగబాకగా.. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 13 స్థానాలను మెరుగుపర్చుకున్నాడు. శ్రీలంక టీ20 కెప్టెన్ కుశాల్ మెండీస్ 3 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకపై 50, 90 పరుగులకు చేసిన పాకిస్థాన్ ప్లేయర్ మస్ సదాకర్ ఏకంగా 187 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకున్నాడు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాట్‌ రేన్‌షా 147 స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో డర్బన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అతను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 190, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్ ప్లేయర్ అటల్ 41 స్థానాలు ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అఫ్గాన్ ప్లేయర్ సెటిగొల్లా అటల్ సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్‌లో శతకం సాధించిన రెహ్మత్ షా 13 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ అందుకున్నాడు.

Story first published: Wednesday, October 14, 2026, 17:54 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+