IND vs WI: ఊచకోత.. ఇండోర్‌లో అభిషేక్ శర్మ రికార్డుల విధ్వంసం!
IND vs WI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో వెస్టిండీస్‌పై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ విషయంలో అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ, సంజు శాంసన్‌ల రికార్డులను అధిగమించాడు. ఇటీవల రాంచీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 21 బంతుల్లో అర్ధశతకం సాధించగా.. 2019లో వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ ఈ ఇద్దరు దిగ్గజాలను అధిగమించి ఈ గొప్ప రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
వెస్టిండీస్‌పై భారత్ తరఫున వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ
18 బంతులు: అభిషేక్ శర్మ (ఇండోర్, 2026)
21 బంతులు: విరాట్ కోహ్లీ (ముంబై - వాంఖడే, 2019)
21 బంతులు: సంజు సామ్సన్ (రాంచీ, 2026)
22 బంతులు: రోహిత్ శర్మ (లాడర్‌హిల్, 2016)
23 బంతులు: రోహిత్ శర్మ (ముంబై - వాంఖేడే, 2019)
23 బంతులు: సూర్యకుమార్ యాదవ్ (ప్రావిడెన్స్, 2023)

వెస్టిండీస్‌పై టీ20 చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు
ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్‌పై అత్యంత వేగవంతమైన టీ20 అర్ధశతకం సాధించిన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ పేరిట ఉంది. క్వింటన్ డి కాక్ 15 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు అభిషేక్ శర్మ డేవిడ్ వార్నర్, కోలిన్ మున్రోలతో కలిసి మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు.
15 బంతులు: క్వింటన్ డి కాక్ (సెంచూరియన్, 2023)
16 బంతులు: టిమ్ డేవిడ్ (బాసెటెర్రే, 2025)
18 బంతులు: డేవిడ్ వార్నర్ (సిడ్నీ, 2010)
18 బంతులు: కోలిన్ మున్రో (మౌంట్ మౌంగనుయి, 2018)
18 బంతులు: అభిషేక్ శర్మ (ఇండోర్, 2026)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


