Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేం గెలిచినా.. జపాన్ బాగా ఆడింది: శ్రేయస్ అయ్యర్

జపాన్ క్రికెట్‌ టీమ్‌పై టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏకైక టీ20 మ్యాచ్‌లో తాము గెలిచినా జపాన్ అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. తమకు గట్టి పోటి ఇచ్చి, ఓడినంత పని చేసిందని ప్రశంసించాడు.

ఆసియా గేమ్స్ 2026‌కు ముందు ఆతిథ్య జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించి ఆడించారు. ఈ గేమ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు అభిమానులు మూడున్నర గంటలు శ్రమించారు.

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

విఫలమైన భారత బ్యాటర్లు..

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

Shreyas Iyer Hails Japan After India s Win in Only T20I Ahead of Asian Games 2026

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు.

కెప్టెన్సీతో మరింత మెరుగ్గా ఆడుతా..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు. 'టీ20 ప్రపంచకప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. ఈ బాధ్యతతో పాటు నాపై కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ, ఒత్తిడి ఉన్నప్పుడే నేను ఇంకా బాగా ఆడుతాను. సారథ్య బాధ్యతలు నేను మరింత మెరుగ్గా రాణించేలా చేస్తాయి."

ఆసియా గేమ్స్‌లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించడమే మా ప్రధాన లక్ష్యం. అయితే దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏ రోజు మ్యాచ్‌పై ఆరోజు దృష్టి పెట్టి ఆడటం జట్టుకు చాలా మంచిది.

IND vs AUS: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ కొడుకు.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs AUS: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ కొడుకు.. భారత్ ఘన విజయం!

భారత్-జపాన్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయినందుకు ఇరు దేశాలకు అభినందనలు. మ్యాచ్ కోసమని దాదాపు 3 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. కేవలం 5 ఓవర్ల మ్యాచ్‌ జరిగినా.. మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. జపాన్ టీమ్ కూడా చాలా బాగా ఆడింది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 22, 2026, 16:19 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+