Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

IND vs SL: 2026 ఆసియా క్రీడలలలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ మైదానం వేదికగా జరిగిన పోరులో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత మహిళలు ఈ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది మొదటి స్వర్ణ పతకం కావడం విశేషం. గతేడాది ఆసియా క్రీడల ఫైనల్లోనూ శ్రీలంకపైనే గెలిచి పసిడి సాధించిన టీమిండియా ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి ఆసియాలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

Asian Games 2026: స్మృతి మంధాన విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

Asian Games 2026: స్మృతి మంధాన విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

ఈ చారిత్రాత్మక పోరులో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కొండంత స్కోరుకు గట్టి పునాది వేశారు. స్మృతి మంధాన కేవలం 45 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి విజృంభించగా.. షెఫాలీ వర్మ 29 బంతుల్లో 48 పరుగులు సాధించింది. చివరిలో వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో నాటౌట్ గా 49 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించింది.

Asian Games 2026 India Women Win Gold Medal in Cricket Crush Sri Lanka by 147 Runs

అనంతరం 217 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు 21 బంతుల్లో 29 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. దీంతో లంక జట్టు 15.4 ఓవర్లకే 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో లంక జట్టు రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

భారత్ X జపాన్ .. 5 ఓవర్ల మ్యాచ్! వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు!

Also Read

భారత్ X జపాన్ .. 5 ఓవర్ల మ్యాచ్! వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు!

మరోవైపు ఆసియా క్రీడల్లో కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్ ను 31 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్తాన్ కాంస్య పతకం సాధించింది. టోర్నీ అంతటా ఆధిపత్యం చెలాయించిన భారత్ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌ను, సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్‌కు చేరగా.. ఫైనల్లో లంకను చిత్తు చేసి ఆసియా క్రీడల్లో భారత రంగాన్ని పసిడితో మెరిపించింది.

Story first published: Tuesday, September 22, 2026, 13:52 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+