IND vs AUS: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ కొడుకు.. భారత్ ఘన విజయం!
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్(48 బంతుల్లో 9 ఫోర్లతో 47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత అండర్ 19 టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో భారత అండర్ 19 టీమ్ అద్వితీయమైన ప్రదర్శనతో 102 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా అండర్ 19 జట్టును ఓడించింది. ఈ విజయంతో మూడు యూత్ వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 341 పరుగులు చేసింది. యశ్‌బర్ధాన్ చౌహన్(100 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) సెంచరీతో చెలరేగగా.. వీకే వినీత్(92 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87) సెంచరీ చేజార్చుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్(9) ఆకట్టుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియా అండర్ 19 బౌలర్లలో థామస్ వాసియో(3/78) మూడు వికెట్లు తీయగా.. పాట్రిక్ సులివన్(2/55) రెండు వికెట్లు పడగొట్టాడు. కాన్నర్ గ్రేగరీ(1/57) ఒక వికెట్ తీసాడు. అనంతరం ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ 41.1 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
కెప్టెన్ జాక్ జోస్నెక్(63 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81), బ్లేక్ క్యాటిల్(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), జెడ్ హోలిక్(37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత అండర్ 19 బౌలర్లలో చిగురుపాటి వెంకట(3/65) మూడు వికెట్లు తీయగా.. కావ్య పరేష్ పటేల్(2/23), యశ్‌బర్థన్ చౌహన్(2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


