కఠినమైన పిచ్‌పై అభిషేక్ బ్యాటింగ్ అమోఘం: శ్రేయస్ అయ్యర్
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కఠినమైన పిచ్‌పై అభిషేక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని తెలిపాడు. అతని బ్యాటింగ్ చూడముచ్చటగా ఉందని అభిప్రాయపడ్డాడు.
అఫ్గానిస్థాన్‌తో గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అభిషేక్ బ్యాటింగ్ అద్భుతం..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. అభిషేక్ శర్మతో పాటు అక్షర్ పటేల్ ప్రదర్శనను కొనియాడాడు. 'మేం ఏదో ప్రత్యర్థి జట్టును తొక్కేసాం అని అనను గానీ.. ఆతిథ్య జట్టుకు కొంత గౌరవం తప్పకుండా ఇవ్వాలి. వాళ్లు కూడా మెరుగైన ప్రదర్శనే చేశారు. దానికి మెచ్చుకోవాల్సిందే. పిచ్ ఏమీ అంత ఈజీగా లేదు. కానీ అభిషేక్ శర్మ ఆడిన తీరుకు అసలు తిరుగు లేదు. చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది.

నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు మేందు ముందుగానే బ్యాటింగ్ చేస్తామనే విషయం నాకు ముందే తెలుసు. ఎందుకంటే.. అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్‌తో మాట్లాడినప్పుడు అతను ముందుగా బౌలింగే ఎంచుకుంటానని చెప్పాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కూడా అతను ముందుగా బౌలింగే చేయాలనుకున్నానని తెలిపాడు. కాబట్టి టాస్ గెలిచినా.. ఓడినా ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నామని నేను ముందే ఊహించాను.
అక్షర్‌కు ఇది కొత్త కాదు..
నేను అనుకున్నట్లే అసాధారణమైన ఆరంభం లభించింది. ఆ తర్వాత మంచి రన్స్ రాబట్టి స్కోర్‌ను 220 పరుగులు చేయడం సంతోషంగా ఉంది. అక్షర్ పటేల్ స్పెల్ ప్రత్యేకమైనది. గతంలోనూ అతను ఇలాంటి ప్రదర్శనలే కనబర్చాడు. అతనికి అపారమైన అనుభవం ఉంది.
మ్యాచ్‌లో క్లిష్ట సమయం ఎప్పుడు వస్తుందో.. ఆ సమయంలో జట్టును ఎలా గట్టెక్కించాలో అతనికి బాగా తెలుసు. ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. తన ఆట గురించి తను బాగా ఆలోచించే ఒక మంచి పరిణతి ఉన్న ఆటగాడు అక్షర్. సుదీర్ఘకాలంగా స్థిరంగా రాణిస్తున్నందుకు అతనికి హాట్సాఫ్.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఏకపక్ష విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. సంజూ శాంసన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం అఫ్గానిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్(16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి(3/25), రవి బిష్ణోయ్(3/26) మూడేసి వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


