Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా జీవితంలోనే ఇలాంటి బ్యాటింగ్ చూడలేదు.. పిచ్చోడినయ్యా: శ్రేయస్ అయ్యర్

ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలపై టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారని కొనియాడాడు. ఈ తరహా బ్యాటింగ్‌ను తన జీవితంలోనే చూడలేదని, వారి ఆటను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదని ప్రశంసించాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ(38 బంతుల్లో9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113), వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) విధ్వంసకర బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. పవర్ ప్లేలోనే 118 పరుగుల రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

IND vs NZ: సెంచరీతో రఫ్ఫాడించిన అభిషేక్ శర్మ.. సిరీస్‌ భారత్ కైవసం!

IND vs NZ: సెంచరీతో రఫ్ఫాడించిన అభిషేక్ శర్మ.. సిరీస్‌ భారత్ కైవసం!

వారి బ్యాటింగ్‌కు పిచ్చోడినయ్యా..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. వైభవ్, అభిషేక్ శర్మల బ్యాటింగ్‌కు పిచ్చోడినయ్యానని తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా ఏం లేదని, వారు అంత ఈజీగా ఎలా ఆడారో అర్థం కావడం లేదని చెప్పాడు.

Shreyas Iyer Hails Abhishek Sharma and Vaibhav Sooryavanshi After India s 3rd T20I Win Says Pleasing to the Eyes

'నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ విజయం. వైభవ్, అభిషేక్ ఆడిన షాట్స్ చూడటానికి నా రెండు కళ్లు సరిపోలేదు. నేను, సంజూ బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి బాగా స్వింగ్ అయ్యింది. షాట్స్ ఆడటానికి చాలా కష్టమైంది. బ్యాటింగ్ చేసేటప్పుడు నాకైతే మైండ్ పోయింది. అసలు పవర్ ప్లేలో వైభవ్, అభిషేక్ అంత ఈజీగా ఎలా ఆడారా? అనేది అర్థం కాలేదు.

నా జీవితంలోనే చూడలేదు..

నిజం చెప్పాలంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేయడం నేను నా జీవితంలోనే ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఈ ఇన్నింగ్స్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యం. బౌలర్ల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతాయి.

వాటిని ఎదుర్కోని ఈ స్థాయి ప్రదర్శన కనబర్చాలంటే వారికి కాస్త స్వేచ్ఛ ఇవ్వాల్సిందే. ఈ ప్రదర్శన క్రెడిట్ మాత్రం పూర్తిగా వైభవ్, అభిషేక్ శర్మలదే. ఈ రోజు వాళ్లు ఆడిన తీరు అమోఘం. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే జోరును కొనసాగిస్తారని ఆశిస్తున్నా.

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

Also Read

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

యార్కర్లతో కట్టడి చేశాం..

10 ఓవర్ల తర్వాత నాకు ఓ విషయం అర్థమైంది. బౌలర్లు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేసినా బంతి బౌండరీ బయట పడుతోంది. దాంతో యార్కర్లు వేయాలని, అవసరమైతే ఓవర్‌లోని 6 బంతులను యార్కర్లుగా సంధించాలని సూచించాను. స్ట్రైట్‌గా కొట్టేలా లేదా వైడ్ యార్కర్స్ వేస్తేనే బ్యాటర్లను కట్టడి చేయగలమని మా బౌలర్లకు చెప్పాను. నేను చెప్పినట్లే మా బౌలర్లు చేశారు. దాంతో ఓవర్‌కు 8-9 రన్స్ మాత్రమే వచ్చాయి. వాళ్లను 200 పరగుల్లోపే కట్టడి చేయాలనేది మా ప్లాన్. అనుకున్నట్లే కట్టడి చేశాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 27, 2026, 17:54 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+