Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సెంచరీతో రఫ్ఫాడించిన అభిషేక్ శర్మ.. సిరీస్‌ భారత్ కైవసం!

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ(38 బంతుల్లో9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113) విధ్వంసకర శతకంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.

అభిషేక్ శర్మతో పాటు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) దూకుడుగా ఆడటంతో భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(2/41) రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీసారు. భారత ఓపెనర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు.

IND vs NZ మూడో టీ20కి పోర్టబుల్ పిచ్.. ఇదేందయ్యా ఇది ఎక్కడా చూడలే!

IND vs NZ మూడో టీ20కి పోర్టబుల్ పిచ్.. ఇదేందయ్యా ఇది ఎక్కడా చూడలే!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిన్ అలెన్(25 బంతుల్లో 5 సిక్స్‌లతో 40), బెవాన్ జాకబ్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.

Abhishek Sharma Century and Vaibhav Sooryavanshi s 45 Power India to Series Win Against New Zealand

వైభవ్, అభిషేక్ ఊచకోత..

లక్ష్య ఛేదనలో తొలి ఓవర్ నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఫస్ట్ బాల్‌నే వైభవ్ సూర్యవంశీ బౌండరీ బాది ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు. ఇదే ఓవర్‌లో వైభవ్, అభిషేక్ చెరో సిక్సర్ బాదారు. ఆడమ్ మిల్నే వేసిన రెండో ఓవర్‌లో 6, 6, 4 బాదిన అభిషేక్ శర్మ.. మైఖేల్ బ్రేస్ వేసిన మూడో ఓవర్‌లో 4, 6, 4 బాదాడు. దాంతో 2.2 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది. జెమీసన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ హాఫ్ సైడ్ బౌండరీలు బాదితే.. వైభవ్ లెగ్ సైడ్ కొట్టాడు. దాంతో 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన భారత్.. పవర్ ప్లేలో 118 పరుగులతో రికార్డ్ స్కోర్‌తో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.

35 బంతుల్లోనే శతకం..

భారీ షాట్ ఆడే క్రమంలో హాఫ్ సెంచరీ ముంగిట వైభవ్(45) ఔటవ్వగా.. తొలి వికెట్‌కు నమోదైన 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వైభవ్ ఔటైనా.. అభిషేక్ చెలరేగాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిషర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ సాంట్నర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన మిచెల్ సాంట్నర్ జెమీసన్ బౌలింగ్‌లో బౌండరీ బాది 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IND vs NZ: అభిషేక్, వైభవ్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన భారత్!

Also Read

IND vs NZ: అభిషేక్, వైభవ్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన భారత్!

అంతర్జాతీయ టీ20ల్లో అతనికి ఇది నాలుగో శతకం కావడం గమనార్హం. ఆ తర్వాత వరుసగా 6, 4 బాదిన అభిషేక్.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ ఔటైన అనంతరం భారత్ పరుగుల వేగం తగ్గింది. ఆచితూచి ఆడిన శ్రేయస్ అయ్యర్(5)సాంట్నర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే సంజూ శాంసన్(18)ను జెమీసన్ క్లీన్ బౌలర్డ్ చేశాడు. కానీ క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ బౌండరీ బాది భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Tuesday, October 27, 2026, 15:47 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+