టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్, శ్రేయస్ అయ్యర్‌లకు చెక్!
టీమిండియా వరుస ఓటములపై సమీక్ష నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమైనట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లతో అత్యవసర సమావేశం నిర్వహించి వరుస పరాజయాలకు వివరణ కోరాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. భారత జట్టు పేలవ ప్రదర్శనపై బీసీసీఐ అధికారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ 6 టీ20లు, రెండు వన్డేల్లో ఓటమిపాలైంది. ఈ ఓటముల వెనుక గల కారణాలను బీసీసీఐ ఆరా తీయనుంది.

ఈ సమావేశానికి టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, తాత్కలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, సెలెక్టర్లు, బీసీసీఐ అధికారులు హాజరు కానున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని.. విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగయ్యేందుకు చేపట్టాల్సిన మార్పులు, ఆటగాళ్ల ఎంపిక, వ్యూహాలపై వివరంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో తక్షణ నిర్ణయాలేవి తీసుకోనప్పటికీ గంభీర్, శ్రేయ్యర్ ఇద్దరికీ ఒక వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గంభీర్‌కు 2027 వరకు ఒప్పందం ఉన్నందున అతని పదవికి వచ్చే ముప్పు ఏం లేనప్పటికీ, వన్డే, టీ20 క్రికెట్‌లో జట్టు ఘోర ప్రదర్శన ఒత్తిడిని పెంచుతోంది.
టెస్ట్‌ల్లో భారత ప్రదర్శన మరీ నాసిరకంగా తయారైంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబర్చే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతోనే గంభీర్‌తో అత్యవసర సమావేశానికి బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైఖరిపై కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే అతనికి మరికొన్ని సిరీస్‌ల వరకు అవకాశం ఇవ్వవచ్చు. 2026 ఆసియా గేమ్స్‌లో భారత్ గోల్డ్ మెడల్ సాధిస్తే అతనిపై ఉన్న ఒత్తిడి తగ్గనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

