IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?
వరుసగా మూడు పరాజయాల్లో ఓటమిపాలైన టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. గురువారం(జూలై 23) హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది.
పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో 4-0తో వైట్ వాష్ అయ్యింది. దాంతో టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను ఇంగ్లండ్‌కు కోల్పోయింది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మరింత యంగ్ టీమ్‌తో జింబాబ్వేకు చేరుకున్న అయ్యర్.. ఈ పర్యటనలోనైనా విజయం సాధిస్తాడా? లేక పరాజయాల పరంపర కొనసాగిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయిన భారత్.. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది.

బరిలో బుడ్డోడు..
అయితే జింబాబ్వే భారత్‌కు ఏ మాత్రం పోటీ కాదు. 2015 నుంచి ఆ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేదు. కానీ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిన టీమిండియాకు షాకివ్వాలని జింబాబ్వే కూడా భావిస్తోంది. ఇక టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంగ్లండ్ గడ్డపై భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇందులో రెండు సార్లు జోఫ్రా ఆర్చర్ బౌన్సర్ ఆడబోయి ఔటయ్యాడు. దాంతో బుడ్డోడి సామర్థ్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జింబాబ్వే పర్యటన చక్కటి అవకాశం. ఎందుకంటే ఈ సిరీస్ నుంచి సంజూ శాంసన్‌కు విశ్రాంతి కల్పించారు.
భారత్ X జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్..
జూలై 23న, 25, 26 తేదీల్లో వరుసగా మూడు టీ20లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లకు హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మూడు మ్యాచ్‌లు సాయంత్రం 4.30 గంటలకు మొదలవ్వనున్నాయి.
ఎలా చూడాలంటే..?
భారత్ X జింబాబ్వే టీ20 సిరీస్‌కు జీ నెట్ వర్క్‌కు చెందిన యునైటెడ్8 స్పోర్ట్స్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫ్యాన్ కోడ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనున్నాయి. ఫ్యాన్ కోడ్ యాప్‌తో పాటు యునైటెడ్8 స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూసే వెసులు బాటు అయితే లేదు.
కోచ్‌గా లక్ష్మణ్..
ఈ పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఆటగాళ్లను కూడా దూరంగా ఉంచారు. గాయంతో దూరమైన వరుణ్ చక్రవర్తీ స్థానంలో రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కింది. మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ వంటి యువ బౌలర్లకు అవకాశం దక్కింది.
జింబాబ్వే పర్యటనకు భారత్ జట్టు:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవిబిష్ణోయ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సూర్యన్ష్ షెడ్జే, అశోక్ శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

