IND vs ZIM: టాస్ ఓడిన భారత్.. తుది జట్టులో కీలక మార్పు!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది వింటర్ వికెట్. ఆరంభంలో కొంచెం బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకొని వికెట్లు తీయాలనుకుంటున్నాం.
గత మ్యాచ్‌తో పోల్చితే ఈ పిచ్ చాలా భిన్నంగా ఉంది. గత మ్యాచ్ తరహాలో మరీ స్పైసీగా ఉండకపోవచ్చు. కానీ హరారేలో శీతాకాలంలో పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తోంది. ఈ అడ్వాంటేజ్‌ను మా సీమర్లు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నా. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు.'అని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ పిచ్ కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఉన్నంత జిగటగా లేదు. బౌన్స్ స్థిరంగా ఉంటుందని నేను భావిస్తున్నా. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తొలి మ్యాచ్ విజయానంతరం మా కుర్రాళ్లకు ఒక్కటే చెప్పింది. ప్రస్తుత కాలంలో ఉండాలని చెప్పాను. విజయ గర్వంతో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని సూచించాను.
డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ప్రతిభ ఉంది. పటిష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగితే.. విజయం సాధించవచ్చు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. అశోక్ శర్మ స్థానంలో యశ్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), శ్రేయస్ అయ్యర్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(w), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

