ఆ ఇద్దరు క్లిక్ అయితే ఇలానే ఉంటుంది.. అతని రాకతో ఆ లోటు తీరింది: శ్రేయస్ అయ్యర్
ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ క్లిక్ అయితే తమ విజయం సునాయసమని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ విషయం తాజా ఫలితంతో మరోసారి స్పష్టమైందన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లతో పాటు నమన్ ధీర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. నమన్ ధీర్‌తో జట్టుకు మంచి ఆప్షన్స్ లభిస్తున్నాయని చెప్పాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో జట్టుకు అతను అసెట్‌గా మారాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా లోయరార్డర్‌లో ఫినిషర్ లోటు తీరిందని చెప్పాడు.
చాలా సంతోషంగా ఉంది..
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపుతో మా ప్రయాణ అలసటను మర్చిపోవాల్సిందే. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బౌలింగ్ చేశాం. ఆరంభంలో పిచ్ స్లోగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. దాంతో హార్డ్ లెంగ్త్స్ కంటే కాస్త ముందుకు వేసాం. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ డ్యూ రావడంతో పిచ్ ఫ్లాట్‌గా మారింది. బంతి స్కిడ్ అవుతూ చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది.

ఈ అడ్వాంటేజ్‌ను వాడుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లు మూమెంటమ్ అందుకొని 225 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లను మెచ్చుకోవాల్సిందే. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే మంచి ఆరంభం దక్కాలి. పవర్ ప్లేలోనే 80-85 పరుగులు చేయాలి. కానీ మా బ్యాటర్లు మరో 10 పరుగులు అదనంగానే చేశారు.
క్లిక్ అయితే చాలు..
మా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌కు ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి చాలా అనుభవం ఉంది. ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. ఒకసారి వాళ్లు ఫామ్‌లోకి వస్తే ఆ జోరును అలాగే కొనసాగిస్తారు. ఈ మ్యాచ్ దానికి మంచి ఉదాహరణ. ప్రతీసారి ఇది జరగకపోవచ్చు. కానీ వాళ్లు క్లిక్ అయితే మ్యాచ్‌ను మన చేతుల్లో పెడుతారు. ఆ తర్వాత వచ్చే మేం ఇన్నింగ్స్‌ను నిలబెట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేయడమే మిగులుతుంది.
నమన్ ధీర్‌తో రాకతో జట్టుకు చాలా ఆప్షన్స్ లభించాయి. ముఖ్యంగా ఎడమ చేతివాటం బ్యాటర్లు, కుడిచేతి వాటం బ్యాటర్లకు కూడా అతను బౌలింగ్ చేయగలడు. ఇలాంటి మైదానల్లో 2-3 ఓవర్లు బౌలింగ్ చేయడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. అలాగే ఈ రోజు అతను చూపించిన ప్రశాంతత, సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేసిన తీరు చూడ ముచ్చటగా అనిపించింది.
గెలిపించిన నమన్ ధీర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), నమన్ ధీర్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


