Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: శ్రేయస్ అయ్యర్

లోయారార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డిలపై టీమిండియా టీ20 కెప్టెన్ తిలక్ వర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ముగ్గురి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఓటమి నుంచి గట్టెక్కామని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడూ మ్యాచ్ విన్నరేనని, తాజా మ్యాచే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన భారత్‌కు తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు.

IND vs NZ: తెలుగులో తిట్టుకున్న నితీష్ రెడ్డి, తిలక్ వర్మ!(వీడియో)

IND vs NZ: తెలుగులో తిట్టుకున్న నితీష్ రెడ్డి, తిలక్ వర్మ!(వీడియో)

నితీష్, తిలక్ బ్యాటింగ్‌తో..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం గురించి మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో తిలక్, నితీష్ రెడ్డి పట్టుదలతో ఆడారని కొనియాడాడు. నమన్ ధీర్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.

Shreyas Iyer Credits Tilak Varma Nitish Kumar Reddy and Naman Dhir for India s Win Over New Zealand

'నా దృష్టిలో మా జట్టులోని ప్రతీ ఆటగాడూ మ్యాచ్ విన్నరే. తాజా మ్యాచే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిందనుకున్నా. కానీ తిలక్ వర్మ, నితీష్ రెడ్డి పట్టుదలతో ఆడి గెలిపించారు. నమన్ ధీర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.

అతను పరిపూర్ణమైన ఆటగాడు..

ఆల్‌రౌండర్‌గా నమన్ ధీర్ జట్టుకు పెద్ద ఆస్థిగా మారాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ అతను సత్తా చాటాడు. నమన్ ధీర్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒక ఆటగాడు నాణ్యమైన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేస్తే అంతకంటే జట్టుకు పెద్ద లాభం ఏం ఉంటుంది. పైగా అతను ఫీల్డింగ్‌లో కూడా చిరుతలా కదులుతాడు. అతను పరిపూర్ణమైన ఆటగాడు.

పిచ్ స్లోగా ఉండటంతో ఇన్నింగ్స్ ఆరంభంలోనే మేం చాలా డాట్ బాల్స్ ఆడాం. దాంతో ఛేజింగ్ రన్‌రేట్ బాగా పెరిగింది. వాస్తవానికి క్రీజులోకి వెళ్లినప్పుడు చాలా సునాయసంగా పరుగులు రాబట్టాలని అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు.

IND vs NZ: నాకే కాదు.. అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి: తిలక్ వర్మ

Also Read

IND vs NZ: నాకే కాదు.. అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి: తిలక్ వర్మ

బ్రేస్ వెల్, సాంట్నర్ శాసించారు..

ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో బ్రేస్‌వెల్, సాంట్నర్ మ్యాచ్‌ను బాగా నియంత్రించారు. ఆ సమయంలో షాట్స్ ఆడటం కష్టమైంది. కానీ మేం గ్యాప్ షాట్స్‌తో బౌండరీలకు ప్రయత్నించి ఉంటే మరింత ఈజీగా మ్యాచ్‌ ముగించేవాళ్లం. కానీ అలా జరగలేదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. తదుపరి మ్యాచ్‌కు మరింత బలంగా తిరిగి వస్తామనే నమ్మకం ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన భారత్‌కు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు.

Story first published: Saturday, October 24, 2026, 18:44 [IST]
Other articles published on Oct 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+