IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్‌లో సెంచరీ బాదిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్)అజేయ శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. అతని సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
శ్రేయస్ అయ్యర్‌కు కెరీర్‌లో ఇదే తొలి టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఈ శతకంతో అయ్యర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఛేజింగ్‌లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు.
కోహ్లీ రికార్డ్ బద్దలు..
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు నలుగురు కెప్టెన్లు సెంచరీలు చేశారు. కానీ ఈ నలుగురు కూడా ముందు బ్యాటింగ్ చేసినప్పుడే ఈ ఘనతను అందుకున్నారు. ఛేజింగ్‌లో కెప్టెన్‌గా అత్యధిక స్కోర్ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతను 2019లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌పై 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నాళ్లు కెప్టెన్‌గా ఛేజింగ్‌లో ఇదే టాప్ స్కోర్‌గా ఉండగా.. అయ్యర్ సెంచరీతో అధిగమించాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై 121 నాటౌట్, శ్రీలంకపై 118, వెస్టిండీస్‌పై 111 నాటౌట్ మూడు సెంచరీలు నమోదు చేశాడు. సౌతాఫ్రికాపై సూర్యకుమార్ యాదవ్ 100 సెంచరీ కొట్టాడు. కానీ ఈ నాలుగు శతకాలు ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడే వచ్చాయి. మిడిలార్డర్‌లో ఆడి సెంచరీ బాదిన రెండో కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
తొలి మిడిలార్డర్ బ్యాటర్‌గా..
మరోవైపు.. నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఒక పూర్తి స్థాయి సభ్య దేశంపై సెంచరీ సాధించిన తొలి కెప్టెన్‌గా కూడా శ్రేయస్ రికార్డ్ అందుకున్నాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్(102 నాటౌట్) అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(100), రికీ పాంటింగ్(98 నాటౌట్), ఇయాన్ మోర్గాన్(91), సూర్యకుమార్ యాదవ్ (82 నాటౌట్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో కెప్టెన్‌గా.. నాన్ ఓపెనర్‌గా హ్యారీ బ్రూక్ రికార్డ్‌ను అయ్యర్ సమం చేశాడు. శ్రీలంకపై 35 బంతుల్లోనే శతకం బాదిన రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌పై అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గానూ అయ్యర్ నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం ఫాప్ డుప్లెసిస్ రికార్డ్‌ను అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


