సెంచరీ కోసం కాదు.. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ సెంచరీ కోసం తాను స్ట్రైక్ ఇవ్వలేదని టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. తన కంటే బంతి బాగా టైమ్ చేస్తుండటంతోనే సింగిల్స్ తీసి అతనికి అవకాశం ఇచ్చానని చెప్పాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్)అజేయ శతకంతో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీ కోసం ఇషాన్ కిషన్ ఎక్కువ బ్యాటింగ్ చేయకుండా అతనికి స్ట్రైక్ ఇచ్చాడు.
నా కంటే బాగా ఆడాడు...
మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని అతన్ని ప్రశ్నించగా.. సెంచరీ కోసం కాదని, తన కంటే బాగా ఆడుతుండటంతోనే అయ్యర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చానని తెలిపాడు. 'శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇవ్వడం తెలివైన నిర్ణయం. శ్రేయస్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి బ్యాటింగ్ చూసినప్పుడు అతన్నే ఎక్కువ స్ట్రైక్‌లో ఉంచడం ఉత్తమమని అనిపించింది. రన్ రేట్ కూడా తగ్గకుండా ఉంటుంది. దాంతో నా పని ఈజీ అయిపోయింది. సింగిల్ తీసి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్లడం, అతన్ని వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడినవ్వడమే నా పనిగా మారింది.
ఆ క్యాచ్ ఇప్పటి నమ్మలేకపోతున్నా..
సహచర బ్యాటర్‌కు మద్దతుగా ఉండాలనే విషయం మైదానంలోనే తెలిసిపోతుంది. అవతలి బ్యాటర్ బంతిని బాగా టైమ్ చేస్తున్నాడా? మన కంటే బాగా ఆడుతున్నాడా? లేదా అనేదానిపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఈ రోజు శ్రేయస్ చాలా మంచి టైమింగ్‌తో ఆడాడు. నిజం చెప్పాలంటే.. నేనే ఈ రోజు అంత గొప్ప టచ్‌లో లేను. అందుకే నేనే స్ట్రైక్‌లో ఉండి షాట్లు ఆడటానికి ట్రై చేసేకంటే.. అతన్ని స్ట్రైక్‌లో ఉంచి మ్యాచ్ ఫ్లో అలానే కొనసాగేలా చేయడం ఉత్తమమనిపించింది.
నేను పట్టిన క్యాచ్‌ను నమ్మలేకపోయాను. స్టేడియం లైట్ల కారణంగా ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. కానీ బంతి నా నడుము దగ్గరకు వస్తుందనిపించింది. వెంటనే ఆ వైపు చెయ్యి పెట్టేశాను. అదృష్టవశాత్తు ఆ బంతి నా చేతిలో పడింది. ఆ దేవుడికి ధన్యవాదాలు.
మాకు ఇది కొత్త కాదు..
రెస్ట్ లేకుండా ఆడటం కొత్తేం కాదు. దీని గురించి మేం ఎక్కువ మాట్లాడుకోలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. కానీ వెస్టిండీస్ ఈ మధ్య బాగా ఆడుతోంది. కాబట్టి మైదానంలోకి బరిలోకి దిగామంటే 100 శాతం కష్టపడాల్సిందే. కొన్ని రోజులు శరీరం సహకరించకపోవచ్చు. లేదా మూడ్ సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు 100 శాతం ఎఫర్ట్ పెట్టడమే మన బాధ్యత.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


