Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ అదే తప్పు మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్

తమ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయకపోవడంతోనే ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. తాము చేసిన 158 పరుగుల స్కోర్ కూడా సరిపోదని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ చేతిలో టీమిండియా టీ20 సిరీస్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే వరుసగా రెండు సిరీస్‌లను చేజార్చుకుంది. ఈ ఘోర పరాజయం అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తమ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ జట్టు ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందని, జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లు తొలిసారి ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడుతున్నారని తెలిపాడు.

Shreyas Iyer Blames Poor Execution and Low Score for India s 4th T20I Loss Against England at Bristol

నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు..

ఈ సిరీస్‌లో చాలా తప్పు చేశామని, వాటి నుంచి గుణ పాఠం నేర్చుకుంటామని అయ్యర్ చెప్పాడు. జట్టు గెలవనప్పుడు తన ఇన్నింగ్స్‌కు విలువ లేదని అభిప్రాయపడ్డాడు. 'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపర్చింది. మేం చేసిన 158 పరుగులు స్కోర్ ఏ మాత్రం సరిపోదు. ఇంగ్లండ్ వేగంగా మా లక్ష్యాన్ని ఛేదించింది. ఒకే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని మా బౌలర్లకు చెప్పాను. ఎందుకంటే ఈ పిచ్‌పై మిడిల్, లెగ్ స్టంప్ లైన్‌లో వచ్చే బంతులను ఆడటం కష్టమైంది. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో మేం వెనుకబడ్డాం.

మేం పేస్ మార్చడానికి, కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లు బౌండరీలు రాబట్టారు. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను. కానీ జట్టు విజయానికి ఉపయోగపడనప్పుడు ఆ ఇన్నింగ్స్‌కు విలువ ఉండదు. అందుకే జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నాను.

ఈ తప్పిదాలు ఉపయోగపడుతాయి..

మా జట్టు ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేస్‌లో ఉంది. ఈ సిరీస్‌లో మేం చాలా తప్పులు చేశాం. మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ కండిషన్స్‌లో తొలిసారి ఆడుతున్నారు. విదేశీ పరిస్థితులకు ఎలా అవాటు పడాలో తెలుసుకునేందుకు ఈ తప్పిదాలు ఉపయోగపడుతాయి. అయితే త్వరగా నేర్చుకోవడం చాలా ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా మారడం ఎంత కీలకమో మేం గ్రహించాల్సి ఉంది. మా జట్టులో త్వరగా నేర్చుకునే ఆటగాళ్లు ఉన్నాను. వారు తమను తాము సమీక్షించుకుంటారు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

IND vs ENG: సిరీస్ సమర్పయామి.. నాలుగో టీ20లోనూ భారత్ ఓటమి!

IND vs ENG: సిరీస్ సమర్పయామి.. నాలుగో టీ20లోనూ భారత్ ఓటమి!

అయ్యర్ ఒక్కడే..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఇంగ్లండ్ 13.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 నాటౌట్),ఓపెనర్ ఫిల్ సాల్ట్(42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఏకైక వికెట్ తీసాడు.

Story first published: Friday, July 10, 2026, 6:41 [IST]
Other articles published on Jul 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+