IND vs ENG: సిరీస్ సమర్పయామి.. నాలుగో టీ20లోనూ భారత్ ఓటమి!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వేదిక మారినా టీమిండియా ఆట ఏమాత్రం మారడం లేదు. మరోసారి చెత్త బ్యాటింగ్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం రాత్రి బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
పసికూన ఐర్లాండ్ చేతిలో 0-2తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌కు కూడా సిరీస్ సమర్పించుకుంది. స్వింగ్, బౌన్స్ కండిషన్స్‌లో బ్యాటింగ్ చేయలేక ఓటమికి తల వంచింది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శివమ్ దూబే(23 బంతుల్లో 2 ఫోర్లతో 22) అయ్యర్‌కు కాస్త అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. మరోసారి షార్ట్ పిచ్ బాల్స్‌కే భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అనంతరం ఇంగ్లండ్ 13.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 నాటౌట్),ఓపెనర్ ఫిల్ సాల్ట్(42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఏకైక వికెట్ తీసాడు.
ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఆఖరి టీ20 శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ చేతిలో టీమిండియా టీ20 సిరీస్‌లో ఓటమిపాలైంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే 2 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు ఇదే తొలిసారి. అంతేకాకుండా ఏడేళ్ల తర్వాత వరుసగా రెండు టీ20 సిరీస్‌ల్లో టీమిండియా ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

