IND vs NZ: ఆ తప్పిదమే మా ఓటమి కారణం.. అతన్ని చూసి నేర్చుకోవాలి: శ్రేయస్ అయ్యర్
బౌలింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ముఖ్యంగా గ్లేన్ ఫిలిప్స్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ విజయవకాశాలను దెబ్బతీసాడని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. గ్లేన్ ఫిలిప్స్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న అతన్ని చూసి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.
అతన్ని చూసి నేర్చుకోవాలి..
'నిజం చెప్పాలంటే.. ఈ రోజు మేం మెరుగ్గా బౌలింగ్ చేయలేదు. ముఖ్యంగా పవర్ ప్లేలో మూడో ఓవర్ నుంచే న్యూజిలాండ్ బ్యాటర్లకు మూమెంటమ్ లభించింది. మా బౌలర్లు కొంతవరకు కట్టడి చేయడానికి ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. గ్లేన్ ఫిలిప్స్ అసాధారణ బ్యాటింగ్ చెలరేగాడు. అతని ఆడిన షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ సిరీస్ ఆసాంతం అతను నిలకడగా ఆడాడు. అతన్ని చూసి మేం చాలా నేర్చుకోవాలి.

తప్పిదాలను సరిచేకుంటాం..
మా తప్పిదాలను సమీక్షించుకుంటాం. ఆఖరి టీ20కి ఒకే ఒక్క రోజు సమయం ఉంది. కాబట్టి మేం మా ప్రణాళికలను మార్చుకొని, ఎక్కడెక్కడ మెరుగుపడాలో చూసుకుంటాం. ఆఖరి మ్యాచ్ గెలిచేందుకు మా వంతు 100 శాతం ప్రయత్నం చేస్తాం. ఇక్కడి మైదానాలు ఎలా ఉంటాయో మాకు ముందే తెలుసు. కానీ వా జట్టులో కొందరికీ ఇలాంటి మైదానాల్లో ఆడటం ఇదే తొలిసారి. కాబట్టి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కొంచెం సమయం పడుతుంది.
అయినప్పటీకీ మా కుర్రాళ్లు తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన తీరు అమోఘం. ఈ పర్యటన వారికి మంచి అనుభవం. ఓ గుణపాఠం అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఆడాలనే విషయంపై వారికి మరింత క్లారిటీ వస్తుంది. ఆఖరి మ్యాచ్‌లో మరింత సానుకూలంగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
గ్లేన్ ఫిలిప్స్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/48) మూడు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్(1/49), అక్షర్ పటేల్(1/43), అర్ష్‌దీప్ సింగ్(1/38), నితీష్ కుమార్ రెడ్డి(1/64) చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35), నమన్ ధీర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), అభిషేక్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(4/19) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/17), మాథ్యూ ఫిషర్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నేకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


