Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సెంచరీతో గ్లేన్ ఫిలిప్స్ ఊచకోత.. భారత్ ముందు భారీ లక్ష్యం!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ చేసింది.

గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/48) మూడు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్(1/49), అక్షర్ పటేల్(1/43), అర్ష్‌దీప్ సింగ్(1/38), నితీష్ కుమార్ రెడ్డి(1/64) చెరో వికెట్ పడగొట్టారు.

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటన.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! భారత జట్లలో కీలక మార్పు!

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటన.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! భారత జట్లలో కీలక మార్పు!

మయాంక్ యాదవ్ చెలరేగినా..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌‌లోనే మయాంక్ యాదవ్ అద్భుతమైన బంతితో టీమ్ సీఫెర్ట్(3)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడిన డారిల్ మిచెల్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్‌తో దూకుడుగా ఆడటంతో... పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 67 పరుగులు చేసింది.

Glenn Phillips Century Michael Bracewell s 65 Power New Zealand to 259 7 Against India in 4th T20I

59 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. ఫిన్‌ లెన్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి బెవాన్ జాకబ్స్(7) రాగా.. ఫిలిప్స్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే జాకబ్స్‌ను మయాంక్ యాదవ్ క్యాచ్ ఔట్ చేశాడు.

బ్రేస్‌వెల్, ఫిలిప్స్ ఊచకోత..

ఈ పరిస్థితుల్లో మైఖేల్ బ్రేస్‌వెల్.. ఫిలిప్స్‌తో కలిసి చెలరేగాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత బౌలర్ల యార్కర్లు మిస్సవ్వడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు చేశారు. నితీష్ రెడ్డి వేసిన 16వ ఓవర్‌లో ఫిలిప్స్ 4nb, 2, 6, 6, 6, 6లతో 32 పరుగులు పిండుకున్నాడు.

టీమిండియాలో అతను మరో బుమ్రా: హనుమ విహారి

Also Read

టీమిండియాలో అతను మరో బుమ్రా: హనుమ విహారి

మయాంక్ యాదవ్ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన బ్రేస్‌వెల్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం భారీ సిక్స్‌లు బాదిన అతను ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిచెల్ సాంట్నర్‌తో కలిసి భారీ సిక్సర్‌తో ఫిలిప్స్ 46 బంతుల్లో సెంచరీ సాధించాడు.

సాంట్నర్‌ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నితీష్ రెడ్డి వేసిన ఆఖరి ఓవర్‌లో గ్లేన్ ఫిలిప్స్ భారీ సిక్సర్ బాది.. మరుసటి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నాథన్ స్మిత్ ఓ బౌండరీ బాది జట్టు స్కోర్‌ను 259 పరుగులకు చేర్చాడు.

Story first published: Friday, October 30, 2026, 14:33 [IST]
Other articles published on Oct 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+