IND vs NZ: ఒకే ఓవర్‌లో 32 పరుగులు.. తేలిపోయిన తెలుగు తేజం!(వీడియో)
టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తేలిపోయాడు. చెత్త బౌలింగ్‌తో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నితీష్ రెడ్డి ఒకే ఓవర్‌లో 32 పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్ ధాటికి వరుసగా సిక్సర్లు ఇచ్చుకున్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో గ్లేన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్ తొలి బంతికి మైఖేల్ బ్రేస్‌వెల్ సింగిల్ తీయగా.. నో బాల్‌గా వేసిన రెండో బంతిని ఫిలిప్స్ బౌండరీ తరలించాడు. ఫ్రీ హిట్ బాల్‌ను వైడ్ యార్కర్‌గా వేసిన నితీష్ రెడ్డి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్ దిశగా సిక్సర్ బాదిన ఫిలిప్స్.. ఐదో బంతిని లాఫ్టెడ్ డ్రైవ్‌తో మరో సిక్సర్ కొట్టాడు.

ఐదో బంతిని డీప్ థర్డ్ దిశగా సిక్సర్ కొట్టిన ఫిలిప్స్.. ఆఖరి బంతిని అంపైర్ తలమీదుగా సిక్సర్ తరలించి 32 పరుగులు పిండుకున్నాడు. నితీష్ రెడ్డి యార్కర్లు వేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో మరో సిక్సర్ ఇచ్చుకున్నా ఫిలిప్స్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి ప్రతీ కారం తీర్చుకున్నాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన 16 ఎకానమీతో 64 పరుగులు ఇచ్చుకొని ఒకే ఒక్క వికెట్ తీసాడు. ఒక వైడ్‌తో పాటు నో బాల్ వేసాడు. భారత బౌలర్లలో నితీష్ రెడ్డినే అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం నితీష్ రెడ్డికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/48) మూడు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్(1/49), అక్షర్ పటేల్(1/43), అర్ష్‌దీప్ సింగ్(1/38), నితీష్ కుమార్ రెడ్డి(1/64) చెరో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


