మా ఓటమికి కారణం అదే.. అలా చేసి ఉంటే గెలిచేవాళ్లం: శ్రేయస్ అయ్యర్
క్యాచ్‌లు వదిలేయడమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 56 పరుగుల తేడాతో చిత్తయ్యింది. మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-0తో టీమిండియా వైట్ వాష్ అయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌కు తమకు ఓ గుణపాఠమని చెప్పుకొచ్చాడు. త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడకపోవడంతోనే వరుస పరాజయాలను మూటగట్టుకున్నామని అభిప్రాయపడ్డాడు.

ఈ సిరీస్ మాకు ఓ గుణపాఠం
'ఈ సిరీస్ నుంచి మేం నేర్చుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్కంగా ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. తొలి మ్యాచ్ నుంచి ఇక్కడి పరిస్థితులు నిరంతరం మారుతూ వచ్చాయి. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం ఈ విషయాలను నేర్చుకోవాలి. ఈ సిరీస్‌లో మేం ఇంకా మెరుగ్గా ఏం చేయాల్సిందనే విషయాలను చర్చించుకోవాలి.
క్యాచ్‌లు వదిలేయడం..
మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్‌ది కీలక పాత్ర. విదేశీ పర్యటనకు వచ్చినప్పుడు ఫీల్డింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విదేశాల్లో మైదానాల డైమెన్షన్స్ భిన్నంగా ఉంటాయి. వాటికి తగ్గట్లుగా ఫీల్డర్లు మారాలి. ముఖ్యంగా ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇలాంటి వికెట్‌పై బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోకూడదు. కానీ మేం కొన్ని క్యాచ్‌లను వదిలేసాం. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే ఇంగ్లండ్ 220-225 పరుగులే చేసేది. అప్పుడు ఛేజింగ్‌కు మాకు సులువయ్యేది. దురదృష్టవశాత్తు అలా జరగలేదు.
ఈ మ్యాచ్‌లో కూడా మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఇంగ్లండ్ బౌలింగ్ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని కట్టడి చేశారు. ముఖ్యంగా జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. మేం వదిలేసిన క్యాచ్‌లు మ్యాచ్ గమనాన్నే మార్చేసాయి.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
బట్లర్ బడిత పూజ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131) విధ్వంసకర శతకంతో చెలరేగగా..కెప్టెన్ హ్యారీ బ్రూక్(45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్) పరుగుల సునామీ సృష్టించాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/22) రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇషాన్ కిషన్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), తిలక్ వర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/36) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

