IND vs ENG ఇదేందయ్యా ఇది ఎప్పుడూ చూడలే.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన టీమిండియా!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కావాల్సిన ఆఖరి టీ20కి విచిత్రకరమైన అంతరాయం కలిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం లేదు. వాతావరణం కూడా బాగానే ఉంది. కానీ అంపైర్లు నిర్ణీత సమయంలో టాస్ వేయలేదు. కారణం తెలిస్తే మీ నెత్తిని బాదుకుంటారు. అవును.. విచిత్రకరంగా టీమిండియా ఆటగాళ్లు సౌతాంఫ్టన్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. హెవీ ట్రాఫిక్ కారణంగా భారత ఆటగాళ్లు చాలా ఆలస్యంగా మైదానానికి చేరుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం 6.30 గంటలకు టాస్ వేసి 7 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించాలి. కానీ భారత ఆటగాళ్లు 6.45 గంటలకు మైదానానికి చేరుకున్నారు. దాంతో అరగంట ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. 7.15 గంటలకు టాస్ వేయగా.. 7.30 గంటలకు మ్యాచ్ మొదలైంది.

క్రికెట్ చరిత్రలోనే ట్రాఫిక్ కారణంగా ఆటకు ఆలస్యం అవ్వడం అత్యంత అరుదు. సాధారణంగా వర్షం కారణంగానో లేక మైదానంలోని ఇతర కారణాల వల్లనో మ్యాచ్ ఆలస్యం అవుతుంది. కానీ ఇలా ట్రాఫిక్ కారణంగా ఆలస్యమవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదేందయ్యా ఇది ఎప్పుడూ చూడలే'అని సెటైర్లు పేల్చుతున్నారు.
సౌతాంఫ్టన్‌లో ట్రాఫిక్ కారణంగా మ్యాచ్‌లు ఆలస్యమవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇదే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఆలస్యంగా మైదానానికి వచ్చారు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 3-0తో కోల్పోయింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువుతో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్‌ల తరహాలోనే ఈ మ్యాచ్ కూడా గెలిచి నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ ఉంది. ఇప్పటికే హ్యారీ బ్రూక్ నెంబర్ వన్ ర్యాంకు అందుకోవడమే తమ లక్ష్యమని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

