Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 19న హిట్ మ్యాన్ ఆఖరి వన్డే?

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్ పర్యటనలో పేలవ ఫామ్‌లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ‌కు లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ఆఖరి మ్యాచే చివరిదని తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని రోహిత్ శర్మకు సెలెక్టర్లు తెలియజేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

IND vs ENG: ఇలా ఆడితే కష్టం బాసూ.. యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు!

IND vs ENG: ఇలా ఆడితే కష్టం బాసూ.. యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు!

రోహిత్‌కు సమాచారం..

రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తమ కథనంలో రాసుకొచ్చింది. 'ఇంగ్లండ్ పర్యటన తర్వాత రోహిత్ శర్మను సెలెక్టర్లు పక్కనపెట్టనున్నారు. వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తొలగిస్తున్నట్లు ఇప్పటికే రోహిత్ శర్మకు సమాచారమిచ్చారు.

Bad News For Rohit Sharma Fans Lord s ODI could be Hit Man s last match for India Reports

ఫిట్‌నెస్‌పై వర్క్ చేయడంతో అతన్ని జట్టులో కొనసాగించాలని భావించినా.. పేలవ ఫామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యతను సెలెక్టర్లు అతనికే వదిలేసారు.'అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

వన్డే ఫార్మాట్‌లో మాత్రమే..

ఇప్పటికే అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం 10 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారాపోయాడు. కానీ మునపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. ఈ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 241 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 11, 26 పరుగులే చేసి వెనుదిరిగాడు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

రోహిత్ శర్మ కారణంగా.. సెంచరీ చేసి సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టాల్సి వస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాదే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. శుభ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసింది.

2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో టైటిల్ కోల్పోయింది. రెండు టీ20 ప్రపంచకప్‌లతో పాటు రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మకు కెరీర్‌లో వన్డే ప్రపంచకప్ ఒక్కటే లోటుగా ఉంది. ఆ కల నెరవేరకుండానే అతని కెరీర్‌ ముగియనుంది.

Story first published: Thursday, July 16, 2026, 22:51 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+