Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీది ఏం ఉందన్నా.. ఎలాగోలా మ్యాచ్ గెలిచాం: జోరూట్

భారత్‌తో రెండో వన్డేలో విజయం సాధించడంపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఆట అంత ఆకట్టుకోకపోయినా.. ఎలాగోలా మ్యాచ్ గెలిచామని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన జోరూట్(133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జోరూట్.. సెంచరీ కంటే జట్టు గెలుపే ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

Joe Root Prioritizes England s Victory Over Personal Milestone After Leveling Series Against India With 2nd ODI Win

ఇంత కంటే గొప్ప అనుభూతి ఏం ఉంటుంది..?

'సెంచరీ మిస్ అయినా.. ఈ మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా లార్డ్స్ వన్డేకు ముందు సిరీస్ 1-1తో సమమైంది. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించడం కంటే మించిన గొప్ప అనుభూతి ఏం ఉంటుంది.

IND vs ENG: రెండో వన్డేలో భారత్ ఓటమి!

IND vs ENG: రెండో వన్డేలో భారత్ ఓటమి!

గతంలో కూడా నేను చాలా సెంచరీ ముందు ఔటయ్యాను. కానీ సెంచరీ ముఖ్యం కాదు. జట్టు విజయమే కీలకం. సెంచరీల కోసం కాకుండా మ్యాచ్‌లు గెలవడం కోసమే ఆడుతాం. ఈ విజయంతో ఈ సిరీస్ మాకు సజీవంగా ఉంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి వన్డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

మా బౌలర్ల వల్లే..

ఈ మ్యాచ్ ఆసాంతం పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగానే ఉంది. భారత్‌కు మంచి భాగస్వామ్యాలు లభించినప్పటికీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. దాంతో మాకు బ్యాటింగ్ సులువైంది. క్రీజులో సమయం గడిపే అవకాశం లభించింది. దాంతో వివిధ దశలో ఒత్తిడిని తట్టుకోగలిగాం. ఈ మ్యాచ్ గెలవడానికి మేం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆట అంత ఆకట్టుకోకపోయినా.. ఎలాగోలా గెలిచాం. ఇప్పుడు లార్డ్స్ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.

మా గత 30 మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే మా ఆటతీరు అర్థమవుతుంది. ప్రస్తుత ప్రదర్శనను బట్టే మా జట్టును అంచనా వేయాలి. మేం శ్రీలంకలో సిరీస్ గెలిచాం. గత నాలుగేళ్లలో ఏ జట్టు కూడా అక్కడ సిరీస్ గెలవలేదు. ఆ సిరీస్ తరహాలోనే ఈ సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓడాం. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత మెరుగై పరిస్థితులకు అనుగుణంగా మారాము.

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌ను ఓడించడమే..

వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌ను లార్డ్స్‌లో ఓడించడమే మా ఏకైక లక్ష్యం. మేం ఈ మ్యాచ్ గెలిచిన తీరు.. ఏ స్థితిలో ఉన్నామో చూపిస్తుంది. లార్డ్స్‌లో కూడా ఈ జోరును కొనసాగిస్తాం. అప్పుడు మా జట్టుపై ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుంది.'అని జోరూట్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 17, 2026, 9:37 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+