అందుకే ఆర్‌సీబీ అంటే అభిమానులకు అంత ప్రేమ: క్రికెట్ బ్యూటీ
ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఒకటి. ఆర్‌సీబీ మ్యాచ్‌ల సమయంలో స్టేడియాలు ఎర్ర సముద్రాన్ని తలపిస్తాయి. 18 ఏళ్ల పాటు ఆ జట్టు ఒక్క టైటిల్ గెలవకపోయినా.. అత్యంత చెత్త ప్రదర్శనలు కనబర్చినా.. ఆ జట్టు అభిమాన గణం పెరిగిందే తప్పా.. ఇసుమంత కూడా తగ్గలేదు.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ జట్టు ఒక్క టైటిల్ గెలిస్తే యావత్ దేశం ఊగిపోయింది. బెంగళూరు నగరం ఎరుపెక్కింది. కోట్లాది మంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆర్‌సీబీ క్రేజీ ఇప్పటికీ చాలా మందికి అంతు పట్టదు.

తాజాగా ఇదే విషయాన్ని ఇండియా టుడే ఎడిటర్ రాజ్‍దీప్ సర్దేశాయ్.. ఆర్‌సీబీ మహిళా ప్లేయర్ శ్రేయాంక పాటిల్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. విరాట్ కోహ్లీ వల్లనే ఆర్‌సీబీకి ఇంత క్రేజ్ అని తెలిపింది. 'విరాట్ కోహ్లీ వల్లే ఆర్‌సీబీకి ఇంత క్రేజ్. ఆయన ఆర్‌సీబీ జట్టును అద్భుతంగా నిర్మించారు.
తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నారు. కోహ్లీ, ఆర్‌సీబీ అభిమానులు, బెంగళూరుకు మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. అది కేవలం ఆటకే పరిమితం కాకుండా భావోద్వేగంతో కూడుకున్నది. కోహ్లీ తన ఆటతో జనాలను తనవైపు తిప్పుకొని, అందర్ని ఒకతాటిపైకి తీసుకు వచ్చారు. ఆర్‌సీబీ తరఫున ఆడే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.'అని చెప్పుకొచ్చింది. ఆర్‌సీబీ తరఫున ఆడటంతోనే తనకు టీమిండియాలో ఆడే అవకాశం లభించిందని తెలిపింది.
ఐపీఎల్ 2025, 2026 సీజన్‌లో ఆర్‌సీబీ పురుషుల టీమ్ విజేతగా నిలవగా.. గత మూడేళ్లలో ఆర్‌సీబీ మహిళల టీమ్ రెండు టైటిల్స్ గెలిచింది. ఈ విజయాలతో ఆర్‌సీబీ అభిమానుల చిరకాల కోరిక నెరవేరింది. 17 ఏళ్ల పాటు టైటిల్ కోసం నిరీక్షించిన అభిమానులకు గత మూడేళ్లలో ఐదు టైటిల్స్ దక్కాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీగా ఆర్‌సీబీ చరిత్ర సృష్టించింది. ఆ ఫ్రాంచైజీ విలువ కూడా అమాంతం పెరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

