Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!

శ్రేయాంక పాటిల్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగుతోంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే లేదా క్రికెట్ అభిమాని అయితే.. శ్రేయాంక పాటిల్ సుపరిచితమే. 21 ఏళ్ల శ్రేయాంక బౌలింగ్ ఆల్‌రౌండర్. ఆఫ్‌స్పిన్‌‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా బ్యాటుతోనూ సత్తాచాటే సామర్థ్యం ఆమె సొంతం. పిచ్ కాస్త స్పిన్‌‌కు అనుకూలిస్తే తనలో బీస్ట్ మోడ్ యాక్టివ్ అవుతుంది.

ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటింది. అంతేగాక టోర్నీలో 13 వికెట్లు సాధించిన ఆమె అత్యధిక వికెట్ల వీరవనితగా రికార్డు సాధించింది. పర్పుల్ క్యాప్‌తో పాటు 'ఎమెర్జింగ్ ప్లేయర్' అవార్డు సొంతం చేసుకుంది.

Shreyanka Patil Not only with the game clean bowled with beauty

ఇక కరేబియన్ లీగ్‌లో ఆడిన ఏకైక భారత ప్లేయర్‌గా శ్రేయాంక అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్ పిచ్‌లపై తన సత్తా ఏంటో చాటిచెప్పింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ మెరిసింది. ఆర్సీబీ 16 ఏళ్ల ట్రోఫీ కలను నెరవేర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. అంతేగాక మరికొన్ని నెలల్లో జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్‌కు భారత అమ్ములపొదిలో కొత్త అస్త్రంగా మారింది.

అయితే ఇదంతా ఆట పరంగా. ఆమె వ్యక్తిగత విషయానికొస్తే..2002లో కర్ణాటకలోని బెంగళూరు జన్మించింది. క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమె వెలుగులోకి రాలేకపోయింది. కానీ డబ్ల్యూపీఎల్ స్టార్ అయిన తర్వాత ఆమె లైఫ్ ఛేంజ్ అయిపోయింది. తొలి సీజన్‌లో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌తో విరాట్ కోహ్లి మాట్లాడినప్పుడు శ్రేయాంక పాటిల్ శ్రద్ధగా వినడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత నెట్టింట్లో క్రమంగా ఫేమస్ అయిపోయింది.

ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని ఫ్లకార్డ్‌తో శ్రేయాంకకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ కన్నడ అమ్మాయి గురించి తెలుసుకోవాలని యువత శోధన మొదలుపెట్టింది. ఆటతో పాటు అందంతోనూ క్లీన్ బౌల్డ్ చేసే శ్రేయాంకకు ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. నేషనల్ క్రష్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో తన క్రేజ్ ఊహకు అందని విధంగా మారిపోయింది.

Story first published: Tuesday, March 19, 2024, 16:05 [IST]
Other articles published on Mar 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+