Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీ బ్యాటర్‌పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఊరించి ఊసురుమనిపించింది. అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆరెంజ్ ఆర్మీ.. కీలక ఎలిమినేటర్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. టైటిల్ అందుకోకపోయినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల ప్రదర్శన జట్టు భవిష్యత్తుపై ఆశలను రేకెత్తించింది.

తృటిలో టైటిల్ అందుకునే అవకాశం కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ.. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి రావాలనే పట్టుదలతో ఉంది. తదుపరి సీజన్ కోసం జట్టును బలోపేతం చేయడంపై కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జట్టు బలహీనతలను అధిగమించేందుకు కోనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది.

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

ఆర్‌సీబీతో ట్రేడ్ డీల్..?

ముఖ్యంగా లోయార్డర్‌లో ఫినిషర్‌గా సత్తా చాటే ఇండియన్ బ్యాటర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ డీల్‌కు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌సీబీ ఫినిషర్‌ జితేష్ శర్మ‌ను ఆరెంజ్ ఆర్మీ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది.

IPL 2027 Sunrisers Hyderabad Eye RCB Finisher Jitesh Sharma in Potential Trade Deal Reports

అయితే జితేష్ శర్మకు బదులుగా ఇషాన్ కిషన్‌ను ఆర్‌సీబీ అడిగిందని, దాంతో సన్‌రైజర్స్ ఖంగుతిన్నదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రేడ్ డీల్ చర్చల్లో ఉందని, అతి త్వరలోనే తుది నిర్ణయానికి రెండు ఫ్రాంచైజీలు రానున్నాయని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు.

జితేష్ కోసం ఇషాన్ కిషన్‌ను వదులుకోవాలా..?

అయితే జితేష్ శర్మ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్‌ను వదులుకోలేదు. జట్టు భవిష్యత్ సారథిగా ఇషాన్ కిషన్ ఎదుగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించాడు. ఐపీఎల్ 2027 సీజన్‌లో ప్యాట్ కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌ను వదులుకునే సాహసం ఆరెంజ్ ఆర్మీ చేయకపోవచ్చు.

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

Also Read

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇషాన్ కిషన్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో 602 పరుగులు చేశాడు. మరోవైపు జితేష్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 12.89 సగటుతో 116 పరుగులే చేశాడు. ఫామ్‌లో లేని బ్యాటర్ కోసం ప్రధాన ఆటగాడిని వదులుకుంటారా? అని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Story first published: Thursday, August 13, 2026, 14:19 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+