ఆ ఇద్దరే మా జట్టును ఫైనల్‌కు చేర్చారు: హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-1లో సమష్టిగా రాణించిన భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. స్పిన్నర్లే ఈ మ్యాచ్‌ను శాసించారని అభిప్రాయపడింది. షెఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్.. దీప్తి శర్మ అసాధారణ బౌలింగ్ తమకు విజయాన్ని అందించాయని అభిప్రాయపడింది.
ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. జట్టు వరుస విజయాలపై సంతోషం వ్యక్తం చేసింది. 'వరుస విజయాలు సాధించడం సంతోషంగా ఉంది. మా బ్యాటింగ్, బౌలింగ్ తీరు పట్ల ఆనందంగా ఉన్నాను. ఈ వికెట్‌పై మంచి బంతులకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ముఖ్యంగా స్పిన్నర్లు బంతిని టర్న్ చేసినప్పుడు దానికి తగిన ఫలితం వచ్చింది.

ఇరు జట్లు స్పిన్నర్లు కూడా ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దాంతో బ్యాటర్లకు షాట్స్ ఆడటం కాస్త కష్టంగానే అనిపించింది. స్పిన్నర్లు ఈ పిచ్‌ను చాలా తెలివిగా వాడుకున్నారు. ఇలాంటి పిచ్‌లపై చిన్న చిన్న భాగస్వామ్యాలు చాలా కీలకం. రిచా ఘోష్ కూడా విలువైన షాట్లు ఆడింది. దీప్తి బౌలింగ్‌లో అద్భుతం చేసింది. కీలకమైన సమయంలో వికెట్లు తీసి మాకు బ్రేక్‌త్రూలు అందించింది.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. షె ఫాలీ వర్మ(40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(24), రిచా ఘోష్(21), ప్రతికా రావల్(20) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(2), దీప్తి శర్మ(13), భార్తి ఫుల్మాలి(0) తీవ్రంగా నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తాన ఖాటున్ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులే చేసి ఓటమిపాలైంది. దిలారా అక్తర్(21), షోర్నా అక్తర్(22 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/26), నందని శర్మ(2/10) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. తెలుగు తేజం శ్రీచరణి, ప్రేమ్ రావత్‌కు చెరో వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


