
మరో 18 నెలల వరకు కష్టమే..
ఇక ఈసీజన్‌ను పూర్తి స్థాయిలో పాక్‌లో నిర్వహించగా.. ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. కానీ లీగ్ నాకౌట్ చేరుకోగానే కరోనా పుణ్యమా అర్దాంతరంగా నిలిచిపోయి నిరవధికంగా వాయిదాపడింది. దీంతో పీఎస్ఎల్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని, లీగ్ యజమానులు తమ ఫ్రాంచైజీలు అమ్ముకోవలనుకుంటున్నారని ఆదేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. అంతేకాకుండా తన అంచనా ప్రకారం మరో 16 నుంచి 18 నెలల వరకు పీఎస్ఎల్ నిర్వహించడం చాలా కష్టమని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ జోస్యం చెప్పాడు.

ఇంకొంత సమయం..
‘నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చవని నాకు తెలుసు. కానీ కొంత మంది పీఎస్ఎల్ యజమానులు తమ ఫ్రాంచైజీలు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ను ఆర్థికంగా ఆదుకోని, సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తే నాకన్న సంతోషించే వారు ఎవరూ ఉండరు. కానీ పరిస్థితులను చూస్తే పీఎస్‌ఎల్ మరో 16 నుంచి 18 నెలల వరకు జరిగే అవకాశం లేదనిపిస్తుంది. ప్రపంచకప్ కూడా మరో 8 నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా నుంచి పరిస్థితులు చక్కబడటానికి ఇంకొంత సమయం పడుతుంది.'అని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ పాక్ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.
ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్.. కోహ్లీకి దక్కని కెప్టెన్సీ, బుమ్రాకు నో చాన్స్

అది అసాధ్యం..
ఇక వాయిదా పడిని పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘సెప్టెంబర్ వరకు సరైన క్రికెట్ ఆడకుండా.. పీఎస్ఎల్ ఎలా నిర్వహిస్తారు? ఈ పరిస్థితుల్లో బోర్డు ఫ్రాంచైజీలను డబ్బు అడిగే సాహసం చేయదనుకుంటున్నా. నాకు తెలిసి ఇప్పటికే కొంతమంది యజమానులు తమ ఫ్రాంచైజీలు అమ్ముకోవాడానికి సిద్దంగా ఉన్నారు. దానికి అనుగుణంగా వారికి ఆఫర్స్ కూడా ఉన్నాయి'అని అక్తర్ తెలిపాడు. ఇక పీఎస్‌ఎల్ అభివృద్ది చెందుతుందని, సజీవంగా ఉందని తాను నమ్ముతున్నానని, లీగ్ పురోగతి సాధించడానికి పెద్ద బ్రాండ్ల సాయాన్ని అందుకుంటుందని అక్తర్ చెప్పుకొచ్చాడు.
దళితుల పట్ల యువరాజ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు


Click it and Unblock the Notifications












