Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షై హోప్ బ్యాటింగ్‌తో ఆశలు చిగురించాయి: వెస్టిండీస్ మాజీ క్రికెటర్

వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ శివనారయణ్ చంద్రపాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. షై హోప్ బ్యాటింగ్‌తో వెస్టిండీస్‌ క్రికెట్‌‌లో ఆశలు చిగురించాయని చెప్పాడు. భారత పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లో షై హోప్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేశాడు.

అక్కడే మాకు పట్టు లభించింది.. ఈ అవార్డులతో కష్టమే: వెస్టిండీస్ కెప్టెన్

అక్కడే మాకు పట్టు లభించింది.. ఈ అవార్డులతో కష్టమే: వెస్టిండీస్ కెప్టెన్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షై హోప్ బ్యాటింగ్ గురించి మాట్లాడిన చంద్రపాల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షై హోప్ ప్రదర్శన మెరుగవ్వడానికి గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ప్రావిడెన్స్‌లో ఆడటమే ప్రధాన కారణమని తెలిపాడు. 'గయానాలోని ప్రావిడెన్స్‌ పిచ్‌లపై నిలకడగా పరుగులు చేయగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరు. ముఖ్యంగా ఈ వికెట్‌లపై ఎక్కుడగా ఆడి సీనియర్ల‌పై కూడా విరుచుకుపడటం నేర్చుకున్నాడు.

Shivnarine Chanderpaul Hails Shai Hope Says His Batting Offers Fresh Hope for West Indies

ప్రావిడెన్స్ పిచ్‌ల అనుభవం స్పిన్‌ను ఎదుర్కోవడానికి, విభిన్న బౌలింగ్ శైలులకు అలవాటు పడటానికి సహాయపడుతుంది. కెరీర్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన షై హోప్.. ఇప్పుడు సునాయసంగా, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బౌండరీలు బాదుతున్నాడు. గతంతో పోల్చితే అతిని ఆట చాలా మెరుగైంది. ముఖ్యంగా అతని ఆటపై అతనికి పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాను.

అతను అడ్డదిడ్డమైన షాట్స్ ఆడకుండా.. సరైన టైమింగ్‌తో బౌండరీలు బాదుతున్నాడు. ఏమాత్రం గుడ్డిగా బ్యాట్ ఊపడు. గ్యాప్ షాట్స్ ఆడుతాడు. జట్టును ముందుండి నడిపిస్తూ.. అద్భుతమైన బ్యాటింగ్‌తో వెస్టిండీస్‌కు విజయాలను అందిస్తున్నాడు. దాంతో వెస్టిండీస్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

Also Read

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

భారత్‌తో సిరీస్ షిమ్రాన్ హెట్‌మైర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, గుడకేష్ మోతీ, షమార్ జోసెఫ్‌లు కూడా అద్బుతమైన ప్రదర్శన కనబర్చారు. ఈ పర్యటనతో స్వదేశం. విదేశం ఎక్కడైనా మ్యాచ్ గెలవగలమనే నమ్మకం వెస్టిండీస్‌కు వచ్చింది. ఇలాంటి ప్రదర్శన టెస్ట్ క్రికెట్‌లో కూడా పునరావృతమవుతుంది. 'అని చందర్‌పాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు నేరుగా వరల్డ్ కప్‌కి కూడా అర్హత సాధించలేక ఇబ్బంది పడుతోంది.

Story first published: Monday, October 19, 2026, 18:42 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+