Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడే మాకు పట్టు లభించింది.. ఈ అవార్డులతో కష్టమే: వెస్టిండీస్ కెప్టెన్

అదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యంతోనే తమకు పట్టు లభించిందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. దాంతో మిడిల్ ఓవర్లలో స్వేచ్ఛగా ఆడి భారీ స్కోర్ నమోదు చేశామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్ అనంతరం విజయంపై స్పందించిన షై హోప్.. భిన్నంగా ఉన్న ఉప్పల్ పిచ్‌పై 247 పరుగుల భారీ స్కోర్ సాధించడంతోనే గెలుపు సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో తనకు లగేజి సమస్య ఉంచే అవకాశం ఉందని చమత్కరించాడు.

IND vs WI: రఫ్ఫాడించిన కీమో పాల్.. ఉప్పల్‌ మ్యాచ్‌లో భారత్‌‌ ఓటమి!

IND vs WI: రఫ్ఫాడించిన కీమో పాల్.. ఉప్పల్‌ మ్యాచ్‌లో భారత్‌‌ ఓటమి!

సెంచరీ గురించి ఆలోచించలేదు..

'నిజం చెప్పాలంటే ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో నాకు లగేజి సమస్య వచ్చేలా ఉంది(నవ్వుతూ). ఇంటికి వెళ్లేటప్పుడు ఫ్లైట్‌లో నా లగేజ్ బరువు ఎక్కువైపోతుందేమోనని భయంగా ఉంది. జట్టును గెలిపించడానికి నా వంతు ప్రయత్నం చేశాను. సెంచరీ గురించి ఆలోచించలేదు. మాకు 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వాగమ్యం లభించింది. దాంతో మిడిల్ ఓవర్లలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాం. చివర్లో జట్టుకు ఎంత ఎక్కువ పరుగులు వీలైతే అంత ఇచ్చేందుకు ప్రయత్నం చేశాను.

Shai Hope Reveals How 50-Run Opening Stand Helped West Indies Beat India in Hyderabad T20I

247 మంచి స్కోరే అనిపించింది. ఎందుకంటే పిచ్ కాస్త భిన్నంగా ఉంది. మేం ఊహించిన దానికంటే కాస్త నెమ్మదిగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. కొత్త బంతితో బౌలింగ్ చేస్తే కొన్ని బౌన్స్ అయితే.. మరికొన్ని లో-హైట్‌లో వచ్చాయి. ఆ తర్వాత స్పిన్నర్లు, పేసర్ బౌలింగ్ చేసినప్పుడు షాట్స్ కొట్టడం చాలా కష్టమైంది. అందుకే 247 మంచి టార్గెట్ అనుకున్నాం.

అందుకే మరో ఓవర్ ఇవ్వలేదు..

భారత్‌లో ఒకే బౌలర్‌తో వరుసగా 3 ఓవర్లు వేయించడం కొంచెం కష్టం. ఇంకో ఓవర్ ఇస్తే బాగుండేదేమో అని అనిపించినా.. కొన్నిసార్లు మైదానంలో కుదరదు. గుడకేష్ మోటీ రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసినా.. పరిస్థితుల కారణంగా మరో ఓవర్ ఇవ్వలేకపోయాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అది ఛేజింగ్ టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏదేమైనా ఇది చాలా మంచి మ్యాచ్. భారత్ కూడా అన్ని విభాగాల్లోనూ చాలా బాగా ఆడింది. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కానీ మేం గట్టి పోటీ ఇచ్చి సిరీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాం. ఇక బెంగళూరులో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిచే ప్రయత్నం చేస్తాం.'అని షై హోప్ తెలిపాడు.

సంజూ శాంసన్ రాణించినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్‌ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

బ్యాటింగ్ కాదు.. అక్కడే మ్యాచ్ చేజారింది: శ్రేయస్ అయ్యర్

Also Read

బ్యాటింగ్ కాదు.. అక్కడే మ్యాచ్ చేజారింది: శ్రేయస్ అయ్యర్

అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, October 15, 2026, 8:05 [IST]
Other articles published on Oct 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+