Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్- వెస్టిండీస్‌ ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం జరగాల్సిన ఈ మ్యాచ్ 7.4 ఓవర్ల ఆటతోనే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం కాస్త గ్యాప్ ఇవ్వడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌‌ను 9 ఓవర్లకు కుదించారు. కానీ వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

IND vs ZIM: ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: స్మృతి మంధాన

IND vs ZIM: ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: స్మృతి మంధాన

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 7.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(14 బంతుల్లో 2 ఫోర్లతో 22), నమన్ ధీర్(6 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 24 నాటౌట్) దూకుడుగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్, షమార్ స్ప్రింగర్ రెండేసి వికెట్లు తీయగా.. షమార్ జోసెఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.

IND vs WI 5th T20I Ishan Kishan 10-Ball 30 Goes in Vain as Match Is Abandoned Due to Rain

ఇషాన్ కిషన్ ఊచకోత..

భారత్ ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ భారీ సిక్సర్‌తో మొదలుపెట్టాడు. కానీ అదే జోరులో అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ వరుసగా 6, 2, 4, 6, 4, 1 బాది ఒకే ఓవర్‌లో 24 పరుగులు పిండుకున్నాడు. అనంతరం మరో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ అదే జోరులో షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ ఔటైనా సంజూ శాంసన్ 4, 6 బాదడంతో భారత్ 3 ఓవర్లలోనే 2 వికెట్లకు 56 పరుగులు చేసింది.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. రెండు మార్పులతో భారత్!

Also Read

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. రెండు మార్పులతో భారత్!

సంజూ ఔటవ్వగా.. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వరుసగా రెండు బౌండరీలు బాదిన అతను కీమో పాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత నమన్ ధీర్ తన బ్యాట్‌ను ఝులిపించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ(7) ఔటవ్వగానే.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ రద్దవ్వడంతో ఐదు టీ20ల సిరీస్‌ను ఇరు జట్లు పంచుకున్నాయి. మ్యాచ్ రద్దవ్వడం వెస్టిండీస్‌కు కలిసొచ్చింది. 9 ఓవర్ల మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే భారత్ గెలిచేది.

Story first published: Saturday, October 17, 2026, 22:30 [IST]
Other articles published on Oct 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+