Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ ఆటగాళ్లతో కూడిన జట్టులో నా పేరా? వారిపై చర్యలు తీసుకుంటా: శిఖర్ ధావన్

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నీ నిర్వాహకుల‌పై భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించడంపై మండిపడ్డాడు. టోర్నీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ధావన్ ఓ పోస్ట్ పెట్టాడు.

'వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో నా పేరు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. నిర్వాహకులు నా అనుమతి లేకుండా.. కనీస సమాచారం ఇవ్వకుండా నా పేరును వాడుకున్నారు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

ఈ విషయంపై నా లీగల్ టీమ్ తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని, వాటి ఆధారంగా వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాను, అభిమానులను కోరుతున్నాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు'అని ధావన్ ట్వీట్ చేశాడు.

Shikhar Dhawan Threatens Legal Action Over Unauthorised Listing in World T20 Continent Cup

ఈ టోర్నీ కోసం ప్రకటించిన 'ఆసియా వారియర్స్' జట్టులో శిఖర్ ధావన్ పేరు కనిపించింది. ధావన్‌తో పాటు భారత మాజీ ఆటగాళ్లు రాహుల్ శర్మ, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఈ జట్టులో ఉన్నాయి. ఇదే జట్టులో పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్లు సోహైల్ తన్వీర్, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్‌లు కూడా ఉన్నారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

పాక్ ఆటగాళ్లతో కూడిన జట్టులో అనుమతి లేకుండా తన పేరు చేర్చడంపై శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో ధావన్ ఈ టోర్నీ ఆడుతున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు... తాజా ట్వీట్‌ నేపథ్యంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ టోర్నీ ఆడటం లేదని ప్రకటించారు.

Story first published: Wednesday, October 14, 2026, 13:53 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+