హైదరాబాద్: తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. తన పేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ ఫోటోలో తన భార్య హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉండటమే విమర్శలకు కారణం.
భార్య స్లీవ్ లెస్ గౌను: ఫ్యాన్స్‌కు షమీ దిమ్మదిరిగే సమాధానం ఈ ఫోటోను చూసిన కొంత మంది నెటిజన్లు ఓ ముస్లిం అయివుండి ఇలా స్లీవ్‌లెస్ వేసుకోవడం మంచి పద్దతి కాదని, ఆమెను ముస్లింలా పరదాలో ఉంచాలంటూ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేశారు. కాగా, క్రికెటర్ షమీ భార్య వేసుకుని దిగిన ఫోటోలపై రేగిన దుమారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ఓ కథనాన్ని రాశారు.

ఆయన తన ట్విట్టర్లో ఈ ఏడాది నా చివరి వ్యాసం షమీ భార్య స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడం పైనే అంటూ పోస్టు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. శశి థరూర్ రాసిన వ్యాసం సంప్రదాయలపై సమగ్రంగా ఉందంటూ కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
భార్య స్లీవ్ లెస్ గౌను: షమీకి మాజీ క్రికెటర్ల మద్దతు ఇంతకీ ఆ వ్యాసంలో శశి థరూర్ ఏం రాశారంటే ఆయా మతాల సంప్రదాయాలు ఉండటం ఎంత సహజమో, వ్యక్తి స్వేచ్చగా వారు తీసుకునే నిర్ణయం కూడా అంతే సహజమంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ మాటకొస్తే పాకిస్తాన్ ఓ దేశంగా అవతరించడానికి కారణమైన మహ్మద్ అలీ జిన్నా భార్య రుట్టీ ట్రాన్సపరెంట్ షిఫాన్ గౌను వేసుకుని పార్టీలకు వెళ్లేవారని అందుకు ఆధారాలున్నాయంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన వ్యాసంలో జోడించారు.

స్లీవ్ లెస్ గౌనులో క్రికెటర్ షమీ భార్య: ఆగ్రహించిన నెజిజన్లు అంతేకాదు హిందువుల్లో కూడా వస్త్రధారణపై నియమాలు, నిబంధనలు ఉన్నాయనీ, పాటించేవారు పాటిస్తున్నారని అందులో చెప్పుకొచ్చారు. చాలా మంది హిందువులు తమ ఇష్టానుసారంగా వస్త్రధారణ చేసుకునేవారూ ఉన్నారంటూ వ్యాసంలో ఉటంకించారు. చివరగా తన వ్యాసంలో ఎవరికి నచ్చిన వస్త్రధారణ వారు చేసుకోవచ్చు అనేలా శశి థరూర్ చెప్పారు.