భార్య స్లీవ్ లెస్ గౌను: ఫ్యాన్స్‌కు షమీ దిమ్మదిరిగే సమాధానం
హైదరాబాద్: ఓ ముస్లిం అయివుండి ఇలా స్లీవ్‌లెస్ గౌను వేసుకోవడం మంచి పద్దతి కాదని, ఆమెను ముస్లింలా పరదాలో ఉంచాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తున కామెంట్లపై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ట్విట్టర్‌లో అభిమానులకు సమాధానమిచ్చాడు.
ఫొటోలోని వారిద్దరూ తన జీవితమని, ఎంతో సంతోషంతో ఉన్న తమను చూసి ఏడ్చేవారికి తానేమీ చెప్పలేనన్నారు. మంచేదో చెడేదో తనకు తెలుసని, మనిషి మంచితనం తెలియాలంటే అంతరంగం చూడాలని అన్నాడు. వివరాల్లోకి వెళితే తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను షమీ సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
సంతోషంగా గడిపిన క్షణాలు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. అయితే ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ముస్లిం అయివుండి ఇలా స్లీవ్‌లెస్ వేసుకోవడం మంచి పద్దతి కాదని, ఆమెను ముస్లింలా పరదాలో ఉంచాలంటూ పలువురు కామెంట్ చేశారు.

'నువ్వు చేసుకున్నది ముస్లింనా? లేక హిందువునా?' అని కూడా ప్రశ్నించారు. కొందరు అతనికి తన మతం గురించి కూడా గుర్తు చేశారు. నీ భార్య ఎందుకు ముసుగు ధరించలేదు అని కూడా ప్రశ్నించారు. మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. చూడముచ్చటైన కుటుంబమని కొందరు అన్నారు.
ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మహ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని కైఫ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ ఇంగ్లాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications