హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి సోషల్ మీడియాలో ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. ఈ ఫోటోను చూసిన కొంత మంది నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహ్మద్ షమీ ఫేస్‌బుక్ పేజిలో తీవ్రమైన కామెంట్లు చేశారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ పరుష పదుజాలంతో కామెంట్లు కురిపించారు. మరోవైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు.
'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మహ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని కైఫ్ తన ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు. ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు.


ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం.