Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: షై హోప్ అజేయ శతకం.. భారత్‌ ముందు భారీ లక్ష్యం!

వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్(50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్)మరో అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షైహోప్‌తో పాటు షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

అదిరిపోయే ఆరంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు షై హోప్, జావెల్ ఆండ్రూ విధ్వంసకర బ్యాటింగ్‌‌తో చెలరేగడంతో వెస్టిండీస్ 3.3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. జావెల్ ఆండ్రూను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Shai Hope Smashes Unbeaten Century as West Indies Post 247 3 Against India in Hyderabad T20I

క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మైర్‌తో కలిసి షై హోప్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో వెస్టిండీస్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో వెస్టిండీస్ 7.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన షిమ్రాన్ హెట్‌మైర్‌(33)ను ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs WI ఉప్పల్ మ్యాచ్.. అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శ్రేయస్ అయ్యర్

Also Read

IND vs WI ఉప్పల్ మ్యాచ్.. అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శ్రేయస్ అయ్యర్

సిక్సర్‌తో సెంచరీ..

షిమ్రాన్ హెట్‌మైర్ వెనుదిరిగినా.. పోవెల్‌తో కలిసి షై హోప్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోవ్‌మన్ పోవెల్‌(24)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసినా.. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి షై హోప్‌ విధ్వంసం సృష్టించాడు. రూథర్‌ఫోర్డ్ కూడా బ్యాట్ ఝులిపించడంతో 16.4 ఓవర్లలోనే వెస్టిండీస్ 200 పరుగుల మార్క్ అందుకుంది.

42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మయాంక్ యాదవ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ షై హోప్ సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతిని షై హోప్ సిక్స్ బాది 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో షై హోప్‌కు ఇది రెండో శతకం కావడం గమనార్హం.

Story first published: Wednesday, October 14, 2026, 20:59 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+