Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI ఉప్పల్ మ్యాచ్.. అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శ్రేయస్ అయ్యర్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఏ జట్టు అయినా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ భారత్ మాత్రం భిన్నంగా బౌలింగ్ ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడానికి గల కారణాన్ని టాస్ సందర్భంగా టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను సిద్దం చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ కొత్తది కావడంతోనే మా ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో ఒక ఐడియా వస్తుంది. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నా.

IND vs WI Shreyas Iyer Explains Why India Chose to Bowl First on a Batting-Friendly Hyderabad Pitch

విండీస్‌ను తేలిగ్గా తీసుకోం..

మైదాన సిబ్బంది చెప్పినదాని ప్రకారం ఈ పిచ్‌ను 75 శాతం ఎర్రమట్టి, 25 శాతం నల్లమట్టి‌తో తయారు చేశారు. ఇలాంటి పిచ్‌లపై మేం గతంలో కూడా ఆడాం. మంచు ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ పిచ్ గట్టిగా ఉంది కాబట్టి మంచి బౌన్స్ ఉంటుందని ఆశిస్తున్నా. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. వెస్టిండీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోలేం.

ఎందుకంటే ఆ జట్టులో 9వ నంబర్ వరకు హిట్టర్లు ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా.. ప్రతి సెషన్‌ను గెలవడమే మా ఏకైక లక్ష్యం. గత మ్యాచ్‌లో మా జట్టు చూపించిన సహనం అద్భుతం. ఈరోజు కూడా అదే రిపీట్ చేయాలనుకుంటున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మేం సేమ్ కాంబినేషన్‌తో ఆడుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

Also Read

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

రెండు మార్పులతో విండీస్..

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. 'ఇది మాకు తప్పక గెలవాల్సిన మ్యాచ్. కాబట్టి గట్టిగా పోరాడాలి. ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేయడం చాలా ముఖ్యం. పిచ్ బాగుంది. ఈ మ్యాచ్ కోసం మేం రెండు మార్పులు చేశాం. పూరన్, శాంప్సన్ స్థానాల్లో రోమారియో షెపర్డ్, జ్యువెల్ ఆండ్రూ టీమ్‌లోకి వచ్చారు.'అని షై హోప్ తెలిపాడు.

తుది జట్లు:

భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్: షై హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మైర్, రోవ్‌మన్ పొవెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షామర్ స్ప్రింగర్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్.

Story first published: Wednesday, October 14, 2026, 18:58 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+