వారి వల్లే ఈ విజయం.. ఈ గెలుపును తలకెక్కించుకోను: వెస్టిండీస్ కెప్టెన్
రోస్టన్ ఛేజ్ అద్భుతమైన బౌలింగ్.. రోవ్‌మన్ పోవెల్ బ్యాటింగ్ సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. ఈ గెలుపును తలకెక్కించుకోనని స్పష్టం చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.
ఆ భాగస్వామ్యంతో నమ్మకం కుదిరింది..
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హై హోప్.. లెక్కతో బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకున్నామని చెప్పాడు. 'ఇది చాలా కష్టమైన ఛేజింగ్ అవుతుందని అనుకున్నాం. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాక కోలుకోవడం అంత ఈజీ కాదు. కానీ నేను, రోవ్‌మన్ పోవెల్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాక మ్యాచ్ గెలవగలమనే నమ్మకం కలిగింది. వికెట్లు పడకుండా భాగస్వామ్యాలతో ఆడాలని అనుకున్నాం. మేం ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాం. అందుకోసం సరైన బంతులను లెక్కించి మరీ రిస్క్ తీసుకున్నాం.

ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌పై రోస్టన్ చేజ్ అంత అద్భుతంగా బౌలింగ్ చేయడం నిజంగా గ్రేట్. నా దగ్గరున్న ఎస్‌ఎస్ బ్యాట్లు చాలా బాగున్నాయి. ఈరోజు షాట్లు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే కొద్దిగా అదృష్టం కూడా కలిసిరావాలి. పరుగులు సాధిస్తున్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. నేను మ్యాచ్ కోసం చేసుకున్న సన్నాహాలు, నా మానసిక సిద్ధతే నేను బాగా ఆడటానికి కారణం. అలా అని గెలిచాం కదా అని ఈ విజయాన్ని మరీ నెత్తికెక్కించుకోను.'అని షై హోప్ తెలిపాడు.
హోప్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. సంజూ శాంసన్(41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), శ్రేయస్ అయ్యర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 ), తిలక్ వర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 నాటౌట్) దూకుడుగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(3/24) మూడు వికెట్లు తీయగా.. షమార్ స్రింగర్(1/41) ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం వెస్టిండీస్ ఓవర్లలో పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షై హోప్(45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84), విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


