బ్యాటింగ్ కాదు.. అక్కడే మ్యాచ్ చేజారింది: శ్రేయస్ అయ్యర్
బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. పిచ్ తగ్గట్లు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని, తమ ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేయలేకపోయారని తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది.
బౌలింగ్ వైఫల్యమే..
ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. 'మా బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు. మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదు. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. ఆ విషయంలో మా బ్యాటర్ల అప్రోచ్ బాగానే ఉంది. కానీ బౌలింగ్‌లోనే ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. అక్కడే మ్యాచ్ చేజారింది.

బ్యాటింగ్ పవర్ ప్లేలో మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. దాదాపు ఓవర్‌కు 12 రన్స్ చొప్పున పరుగులు చేశాం. అయితే పిచ్ నుంచి వెస్టిండీస్ బౌలర్లకు కూడా అడ్వాంటేజ్ లభించింది. వెస్టిండీస్ గ్రౌండ్ ఫీల్డింగ్‌ను చాలా బాగా వాడుకుంది. నిజం అంగీకరించాల్సిందే... వెస్టిండీస్ బౌలర్ల ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంది.
విండీస్ బౌలింగ్ అద్భుతం..
పిచ్‌పై బంతి కాస్త ఆగి వచ్చింది. అలాగే బౌన్స్ కూడా లభించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వెస్టిండీస్ బౌలర్లు ఈ విషయాన్ని పసిగట్టి అందుకు తగ్గట్లు బౌలింగ్ చేశారు. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది.
250 టార్గెట్ ఛేజింగ్‌లో కూడా మేం 220 పరుగులు చేశామంటే.. ప్రతీ ఆటగాడి అటిట్యూడ్.. గెలవాలనే తపన ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు మ్యాచ్‌ల్లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం, సరైన మైండ్ సెట్‌తో బరిలోకి దిగడం చాలా ముఖ్యం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
బ్యాటర్లు పోరాడినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


