Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: హెట్‌మైర్ రనౌట్‌పై దుమారం.. ఔటా? నాటౌటా? (వీడియో)

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్ రనౌట్‌ తీవ్ర వివాదాస్పదమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా భారత్‌‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో హెట్‌మైర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. క్విక్ సింగిల్ తీసే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. హెట్‌మైర్ డైవ్ చేసి మరీ బ్యాట్‌ను క్రీజులో పెట్టినప్పటికీ.. థర్డ్ అంపైర్ ఔటివ్వడంతో దుమారం రేగింది.

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

అయితే బ్యాట్ క్రీజులో పెట్టినా గాల్లో ఉందని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై హెట్‌మైర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఔటంటే.. మరికొందరు నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఛీటింగ్ చేసిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Out or Not Out Shimron Hetmyer Controversial Run-Out Sparks Debate in IND vs WI 1st T20I

అసలేం జరిగిందంటే..?

అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని షై హోప్.. బౌలర్‌కు ఎడమ వైపు ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. అక్షర్ పటేల్ బంతి వదిలేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వేగంగా వికెట్లవైపు విసిరికొట్టాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ అద్భుతంగా కలెక్ట్ చేసి బెయిల్స్ పడేసాడు. హెట్‌మైర్ డైవ్ చేసినప్పటికీ అతని బ్యాట్ క్రీజును తాకలేదు. గాల్లో ఉండటంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)

Also Read

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)
Story first published: Tuesday, October 6, 2026, 20:07 [IST]
Other articles published on Oct 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+